తాళం వేసితిని.. గొళ్లెం మరిచితిని

Modi Not Asking too Trump About Indian Needs

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Modi Not Asking Trump About Indian Needs

కీలక భేటీపై ఆశలన్నీ నీరుగారిపోయాయి. అన్ని దేశాల్లోనూ టూర్లతో సక్సెస్ సాధించిన మోడీ.. ట్రంప్ దగ్గర మాత్రం ఫెయిలయ్యారు. వీసాల గురించి ప్రస్తావించాలని ఎన్నారైలు కోరినా.. ఆయన మాత్రం ట్రంప్ దగ్గర నోరు తెరవలేదు. అసలు ఇన్నిసార్లు విదేశీ టూర్లకు వెళ్లిన మోడీ.. ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. అధ్యక్షుడితో చాలా సన్నిహితంగా మెలిగిన మోడీ.. అసలు సంగతి మాత్రం చెప్పలేదని అంతా నిట్టూరుస్తున్నారు.

మోడీకి ట్రంప్ అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక మొదటిసారి మోడీకే వైట్ హౌస్ లో విందిచ్చారు. ఆయన కోసం హిందీ నేర్చుకుని మరీ స్వాగతం పలికారు. ఇంత చేసినా.. మోడీ మాత్రం చొరవ తీసుకోలేకపోయారు. మోడీ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేశారని ఎన్నారై ఐటీ వర్గాలతో పాటు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కూడా అభిప్రాయపడుతోంది.

ట్రంప్ మాత్రం ఎలాంటి శషభిషలకు తావు లేకుండా తమ దేశానికి, కంపెనీలకు ఏం కావాలో స్పష్టంగా చెప్పేశారు. అమెరికా నుంచి ఆయుధ దిగుమతులకు థాంక్స్ చెబుతూనే.. ఇండియాలో వ్యాపారం చేసే తమ కంపెనీలకు వాణిజ్యపరమైన అవరోధాల్లేకుండా చూడాలని మోడీని కోరారు. కనీసం అప్పుడు కూడా స్పందిచని మోడీ.. జస్ట్ అమెరికా, ఇండియా మధ్య సంబంధాలు బలపడుతున్నాయని చెప్పేసి వెళ్లిపోవడం ఐటీ వర్గాల్ని అవాక్కయ్యేలా చేసింది.

మరిన్ని వార్తలు:

ఎన్టీఆర్ మనవరాలి మీద పోటీనా?

సోమిరెడ్డి బూజు దులుపుతున్నారా?