జగన్ చొరవ పెంచాల్సిందే

YSRCP-Jagan's-Initiative-Sh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

YSRCP Party Leaders Is That The Jagan Initiative Should Be Increased

జగన్ తమ పార్టీ ఎంపీలతో చొరవ తక్కువే. నేతల్ని కూడా అడుగు దూరంలోనే పెడతారనేది అందరూ అనుకునే మాటే. చివరకు వైఎస్ సమకాలికులకు కూడా గౌరవం ఇవ్వరని, పులివెందుల ఓట్లు కూడా తండ్రి పేరు మీదే పడుతున్నాయనేది ప్రత్యర్థుల వాదన. మొన్నటికి మొన్న వైజాగ్ టూర్లో విజయసాయిరెడ్డితో జగన్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి.

విశాఖలో భూకుంభకోణాలకు వ్యతిరేకంగా ధర్నా చేసిన జగన్.. రిటర్న్ జర్నీలో విజయసాయితో కలిసి ఫ్లైటెక్కారు. కానీ ఇద్దరూ పక్కపక్కన సీట్లో కూర్చోకపోవడం వైసీపీ వర్గల్లోనే చర్చకు దారితీసింది. జగన్ తర్వాత ఓ సీటు వదిలేసిన విజయసాయి.. ఆ పక్క సీట్లో కూర్చున్నారు. ఇద్దరి మధ్య సీట్లో వాటర్ బాటిళ్లు, చిరుతిళ్లు పెట్టారు పార్టీ వర్గాలు.

దీంతో ప్రత్యర్థులు జగన్ పై మండిపడుతున్నారు. జగన్ తన మొనాటనీ వదల్లేదని సెటైర్లు వేస్తున్నారు. కానీ వైసీపీ వర్గాలు మాత్రం తప్పుడు ప్రచారమంటున్నాయి. లోలోపల ఆ పార్టీ నేతలు కూడా మథనపడుతున్నారనేది లోగుట్టు. ఇంత జరుగుతున్నా.. జగన్ తన పద్ధతి మార్చుకోవడం లేదని, పదేపదే ప్రత్యర్థులు దాడిచేసే అవకాశం ఇవ్వడమేంటని వాపోతున్నారు.

మరిన్ని వార్తలు