కమ్యూనిస్టులు మళ్లీ భంగపడ్డారా..?

Communist parties Made A Mistake In Alliances with Pawan Jana Sena

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Communist parties Made A Mistake In Alliances with Pawan Jana Sena

కోరి వస్తామంటే వద్దనడం.. రానన్నవాడి కోసం వెంపర్లాడటం కమ్యూనిస్టులకు మొదట్నుంచీ అలవాటు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు చాలా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు స్వయంగా ఆయనే వెళ్లి అడిగినా.. పొత్తులకు ససేమిరా అన్న కమ్యూనిస్టులు.. 1985 ఎన్నికల్లో చచ్చినట్లు పొత్తు పెట్టుకున్నారు. పైగా అప్పుడు బీజేపీ, కమ్యూనిస్టులు ఇద్దరూ ఎన్టీఆర్ తో మైత్రీ బంధాన్ని ఏర్పాటుచేసుకున్నాయి. బీజేపీతో కమ్యూనిస్టులు కలిసిన చరిత్రే లేదు. కానీ అక్కడ మాత్రం సాధ్యమైంది.

అందే దాన్ని వదిలేసే అందని దాని కోసం పాకులాడే కమ్యూనిస్టులు మళ్లీ జనసేనలో కాలేశారు. పవన్ కళ్యాణ్ పిలవకపోయినా.. మిత్రుడు మిత్రుడంటూ ఎగిరి గంతేసినంత పనిచేశారు. ట్విట్టర్ స్టార్ ను పీపుల్స్ స్టార్ అనుకుని భ్రమపడ్డారు. చివరకు పవన్ కల్యాణ్ కు చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయని తెలుసుకుని సైలంటయ్యారు.

విశాఖలో భూములపై ధర్నాకు ప్లాన్ చేసిన కమ్యూనిస్టులకు పవన్ షాకిచ్చారు. నిజానిజాలు తెలియకుండా బయటికొస్తే పద్ధతిగా ఉండదని తిరస్కరించారు. అంతే విస్తుపోవడం కమ్యూనిస్టుల వంతైంది. బట్ట కాల్చి అధికారంలో ఉన్న వారి ముఖాన వేసే అలవాటున్న కమ్యూనిస్టులకు ఇప్పుడు పవన్ రిప్లై తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైనంత పనైంది.

మరిన్ని వార్తలు:

కసబ్ కేసు కంటే శిరీష కేసు గొప్పదా..?

నక్క ఎక్కడ..? నాగలోకమెక్కడ..?