రాజులకు సీన్ లేదంటున్న బొత్స

Political War Between Botsa And AP Minister Sujaya krishna Ranga Rao

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Political War Between Botsa And AP Minister Sujaya krishna Ranga Rao

కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడుతున్నారు. బలంగా ఉన్న సీనియర్ టీడీపీ నేతలే టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. రాష్ట్ర క్యాబినెట్లో బొబ్బిలిరాజు, కేంద్రంలో విజయనగరం రాజు జిల్లాకు చేసిందేం లేదని ఆడిపోసుకుంటున్నారు. బొత్స మాటలు విజయనగరం ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

టీడీపీ నేతల్ని తప్పుబడుతున్న బొత్స.. ఆయన పదేళ్లు మంత్రిగా ఉండి జిల్లాకు ఏం ఒరగబెట్టారన్న ప్రశ్న వినిపిస్తోంది. అసలు విభజనకు ప్రత్యక్ష కారణం బొత్సేననేది జిల్లాలో పాతుకుపోయింది. అలాంటి సమయంలో మంచి ఇమేజ్ ఉన్న రాజుల్ని తిట్టడం ఆయనకు వ్యతిరేకత పెంచుతోంది. అశోక గజపతి రాజును అవినీతిపరుడని శత్రువులు కూడా అనరు. కానీ బొత్స మాత్రం నిస్సిగ్గుగా విమర్శిస్తున్నారు.

బొత్సపై మండిపడ్డ ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు.. బొత్సతో నీతులు చెప్పించుకునే స్థితిలో తాము లేమన్నారు. అశోక గజపతి రాజు నిజాయితీపరుడని, తాము అవినీతి చేయాల్సిన అవసరం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. బొత్స చేసిన అవినీతి రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసని, ఇప్పుడొచ్చి నీతులు చెబితే కుదరదన్నారు రంగారావు.

మరిన్నివార్తాలు:

మోడీ పేరు చెబితే ఉలిక్కిపడుతున్న చైనా

కేశినేని దారి రహదారి