కేశినేని దారి రహదారి

Vijayawada MP Kesineni Nani Targets Orange Travels

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Vijayawada MP Kesineni Nani Targets Orange Travels

కేశినేని నానికి రాజకీయాలు బాగానే వంటబట్టాయి. తిరుగులేని విధంగా ట్రావెల్స్ వ్యాపారం చేసిన నాని.. ఇప్పుడు సాటి ట్రావెల్స్ యజమానులను ఇబ్బందిపెడుతున్నారు. ముఖ్యంగా ఆరెంజ్ ట్రావెల్స్ పై పగ పెంచుకున్నారనేది ఎంపీ సన్నిహితుల మాట. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని కూడా కేశినేని ఓ అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది. పైగా రాకపోతే అల్టర్నేటివ్ ఉందనడం ఇంకా విచిత్రంగా ఉంది.

రవాణాశాఖపై రైడింగ్ చేసినప్పట్నుంచి కేశినేనిపై బాబు గుర్రుగా ఉన్నారు. అప్పట్నుంచి ప్రతి ఎపిసోడ్ కూడా ఆయన వివాదాస్పదం చేస్తూనే ఉన్నారు. స్వయంగా చంద్రబాబు ఒకటికి రెండుసార్లు పిలిచి మాట్లాడినా నాని తగ్గలేదు. పైగా ఆయన వద్దంటున్నా వినకుండా ట్రావెల్స్ బిజినెస్ క్లోజ్ పేరుతో డ్రామా ఆడారు. కానీ వేరే ట్రావెల్స్ కు తమ వాహనాలు లీజుకిచ్చి భారీ లాభాలు ఆర్జిస్తున్నారని తెలిసిన బాబు మరింత సీరియస్ గా ఉన్నారు.

విజయవాడ లాంటి కీలక స్థానంలో ఎంపీగా నాని లాంటి వారు ఉండకూడదనేది ఇప్పటికే తమ్ముళ్ల నుంచి అధినేతకు ఫీడ్ బ్యాక్ వెళ్లింది. కాబట్టి గట్టి అభ్యర్థి కోసం అన్వేషణ సాగుతోంది. తప్పకుండా ఎన్నికల నాటికి కొత్త అభ్యర్థి బరిలోకి వచ్చే అవకాశం ఉంది. జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే కూడా బాబు అభ్యర్థుల్ని మారిస్తే ఆయనకే ప్రయోజనమని చెప్పడంతో.. ఆ దిశగా కూడా బాబు ఆలోచిస్తున్నారనేది నాని మాట. టికెట్ రాకపోతే సొంత వ్యాపారం చేసుకుంటానన్న ఆయన మాటలకు అంతరార్థం అదేనేమో.

మరిన్ని వార్తాలు:

జగన్ కి అండగా వై.ఎస్ కోటరీ… సబ్బం షరతు?

నంద్యాల ఉపఎన్నిక ఓ మామ, ఓ తమ్ముడికి అగ్నిపరీక్ష.