నంద్యాల ఉపఎన్నిక ఓ మామ, ఓ తమ్ముడికి అగ్నిపరీక్ష.

TDP and YSRCP MLA candidates in nandyala bypoll elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నికల చిత్రం ఖరారైంది. ఇటీవలే టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన శిల్పా మోహన్ రెడ్డి ని అభ్యర్థిగా ప్రకటిస్తూ వైసీపీ ప్రకటన ఇచ్చింది. దీంతో పాత కుటుంబాలకు చెందిన వాళ్ళే కొత్త పార్టీల ద్వారా అభ్యర్థులుగా సీన్ లో నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా నిలబడుతున్న శిల్పా మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిలబడి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక 2014 లో వైసీపీ అభ్యర్థిగా నిలిచి గెలిచిన భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. ఈ ఇద్దరి మధ్య పోటీలో ఎవరు గెలిచినా… ఎవరు ఓడినా ఆయా అభ్యర్థులకు ఏమో గానీ ఓ తమ్ముడు, ఓ మామకి మాత్రం విషమ పరీక్షగా మారింది.

వైసీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్న శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడు చక్రపాణిరెడ్డి టీడీపీ లోనే కొనసాగుతున్నారు. చంద్రబాబు ఏమి చెపితే దాన్ని ఆచరించి చూపుతానని చక్రపాణిరెడ్డి ఓ ప్రకటన ఇచ్చారు. అయితే ఈ మాటలు ఎంతవరకు నిజం… ఆయన్ని ఎంతవరకు నమ్మొచ్చు అన్నదానిపై టీడీపీ హైకమాండ్ ఏమనుకుంటుందో గానీ నంద్యాల నాయకుల్లో మాత్రం భిన్నాభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వ్యూహరచనలో భూమా వర్గం చక్రపాణి రెడ్డిని విశ్వాసంలోకి తీసుకోలేకపోతున్నారు. అన్ననే కాదనుకుంటే నన్నే అనుమానిస్తారా అని చక్రపాణిరెడ్డి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అటు వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి కి కూడా ఇంతకు మించిన సమస్య. వైసీపీ నాయకుడిగా వున్న ఆయన పిల్లని ఇచ్చిన అల్లుడే ఇప్పుడు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. దీంతో అక్కడ వైసీపీ నాయకులు రామిరెడ్డిని డౌట్ డౌట్ గా చూస్తున్నారు. వాళ్ళ ధోరణి రామిరెడ్డి కి చిరాకు తెప్పిస్తోందట. మొత్తానికి బరిలో దిగిన అభ్యర్థుల కన్నా ఒకరి మామకి, ఇంకోరి తమ్ముడికి ఈ ఉపఎన్నిక అగ్నిపరీక్షగా మారింది.

మరిన్నివార్తలు 

పవన్‌ తీరేం అర్థం కావడం లేదు!

బ్రాహ్మణులకి ముద్రగడ పిలుపు ఇదే.