అక్కడ రివ్యూల ఎఫెక్ట్‌తో ఢీలా పడ్డ ‘డీజే’

Duvvada Jagannadham Movie With The Effectiveness Of Reviews

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Duvvada Jagannadham Movie  With The Effectiveness Of Reviews

భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘డీజే’ చిత్రానికి బ్యాడ్‌ రివ్యూలు వచ్చాయి. ఎక్కువ వెబ్‌ మీడియాలో ‘డీజే’ సినిమాపై నెగటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. దాంతో ఓవర్సీస్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం కనిపిస్తుంది. ఓవర్సీస్‌ ప్రేక్షకులు రివ్యూలను చూసి సినిమా చూస్తూ ఉంటారు. మంచి రివ్యూలు వచ్చే సినిమాలు అయితేనే ఓవర్సీస్‌లో ఆడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా వచ్చిన ‘డీజే’ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ అయితే రాబట్టింది. కాని లాంగ్‌ రన్‌లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేక పోతుంది.

ప్రిమియర్‌ షోల రూపంలో ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించింది. అదే ఊపును కొనసాగించి ఉంటే టాప్‌ 10 చిత్రాల జాబితాలో ఉండేది. కాని రెండవ రోజు నుండే కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యాయి. మూడు రోజులు అత్యధిక స్క్రీన్స్‌లలో ఈ సినిమా ప్రదర్శించడం జరిగింది. నేటి నుండి 75 శాతం స్క్రీన్స్‌ను తగ్గిస్తారు. దాంతో ‘డీజే’కు కలెక్షన్స్‌ ఓవర్సీస్‌లో ఆశించిన స్థాయిలో వస్తాయనే నమ్మకం లేదు. రివ్యూల ప్రభావం వల్ల ఓవర్సీస్‌లో దాదాపు రెండు కోట్ల కలెక్షన్స్‌ తగ్గినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. అల్లు అర్జున్‌ ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో మంచి సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. ఈ సినిమాతో అయినా ఆ లోటును భర్తీ చేస్తాడని మెగా ఫ్యాన్స్‌ భావించారు. కాని మరోసారి బన్నీకి నిరాశే మిగిలింది.

మరిన్ని వార్తాలు:

పవన్‌ తీరేం అర్థం కావడం లేదు!