మోడీ పేరు చెబితే ఉలిక్కిపడుతున్న చైనా

China is shivering for US And India Relations

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

China Is Shivering For US And India Relations

ప్రధాని నరేంద్రమోడీ వ్యూహాత్మక విదేశీ బంధాలు చైనాను కలవరపెడుతున్నాయి. ఇప్పటిదాకా భారత్ అంటే బలహీనదేశం అనే భ్రమలో ఉన్న చైనా.. అమెరికా ఇండియాకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి భయపడుతోంది. చైనా అభివృద్ధి, జనాభా, ఆర్థిక వ్యవస్థ అంతా డొల్లేనని తేలడం కూడా డ్రాగన్ కంట్రీని కలవరపెడుతోంది. దీనికి తోడు అమెరికా, ఇండియా వ్యూహాత్మక సంబంధాలు చూసి చైనాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

అప్పుడెప్పుడో 1962 యుద్ధంలో ఓడిపోయిన ఇండియానే ఇప్పుడూ ఉందనే చైనా భ్రమ అమాయకత్వమేనంటున్నారు అమెరికా రక్షణ నిపుణులు. అప్పట్లో కూడా భారత్ యుద్ధానికి సిద్ధంగా లేక ఓడిపోయిందని, లేదంటే చైనాకు చుక్కలు చూపించి ఉండేదని వార్తలొచ్చాయి. అలాంటిది ఎప్పుడు యుద్ధం వచ్చినా సర్వసన్నద్ధంగా ఉన్న ఇప్పటి పరిస్థితులకు, అప్పటికి పోలికే లేదు.
పైగా అమెరికాతో పౌర అణు ఒప్పందం తర్వాత ఇండియా కూడా అగ్రరాజ్యాల దృష్టిలో పెద్ద దేశమైపోయింది. భారత్ తో సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది. చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇప్పుడు హిందూ మహాసముద్రం మొత్తంపై నిఘాకు వీలుగా భారత్ కు డ్రోన్ల అమ్మాలన్న అమెరికా నిర్ణయం చైనాను భయపెడుతోంది.

మరిన్ని వార్తాలు :

బ్రాహ్మణులకి ముద్రగడ పిలుపు ఇదే.