కోనా… ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలవా?

Kona Raghupathi brahmins meeting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఐవైఆర్ కృష్ణారావు ఎపిసోడ్ ని అడ్డం పెట్టుకుని మొత్తం బ్రాహ్మణ వర్గాన్ని వైసీపీ దగ్గరకి చేర్చడానికి పెద్ద స్థాయిలో వ్యూహరచన జరుగుతోంది. ఇందులో వైసీపీకి చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ మూడో వారంలో దాదాపు లక్షమందితో సభ నిర్వహిస్తామని గుంటూరు లో జరిగిన బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో కోన ప్రకటన చేశారు. ఇదేదో ఆషామాషీ ప్రకటన కాదు. 2014 ఎన్నికల్లో బీజేపీ తో పొత్తు ఇంకా ఇతర కారణాలతో బ్రాహ్మణులు పెద్ద ఎత్తున టీడీపీ కి మద్దతుగా నిలిచారు. ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ విషయం గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు తమని ఆదరించిన బ్రాహ్మణ వర్గానికి ప్రాధాన్యం పెంచారు. ఏకంగా వారి కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల నిధులు కేటాయించారు. ఆ కార్పొరేషన్ ని రాజకీయ నాయకుల చేతికి వెళ్లకుండా చూసేందుకే సీఎస్ గా చేసి రిటైర్ అయిన ఐవైఆర్ కృష్ణారావు ని చైర్మన్ గా చేశారు. కానీ వైసీపీ వ్యూహాత్మకంగా ఆయనతో దగ్గర సంబంధాలు పెట్టుకుని మొత్తం వ్యవహారాన్ని రూట్ మారేలా చేసింది. దీంతో అప్రమత్తం అయిన టీడీపీ కృష్ణారావు ని పక్కకి తప్పించినా అప్పటికే కొంత నష్టం జరిగింది. అయితే సమస్యని సాగదీసేందుకు వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరు లో కోన రఘుపతి ఓ సభ పెట్టి టీడీపీ సర్కార్ ని మాత్రమే టార్గెట్ చేశారు. అయితే ఆయన చాలా విషయాలకు సమాధానం చెప్పాల్సి వుంది.

1 . పీవీ నరసింహారావు హయాంలో 23 మంది బ్రాహ్మణులు ఎమ్మెల్యేలుగా ఉంటే ఇప్పుడు నేనొక్కడినే ఎమ్మెల్యే గా వున్నా అని చెప్పిన కోన రఘుపతి చాలా తెలివిగా ఆ పాపాన్ని టీడీపీ కి చుడదామనుకున్నారు. కానీ అసలు పీవీ ప్రభుత్వం పడిపోడానికి కారణం ఎవరో చెప్పలేదు. అదే పీవీ ప్రధానిగా అయితే సాటి తెలుగువాడు అత్యున్నత పదవి పొందినప్పుడు పోటీ తగదని ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించలేదు.కానీ అదే పీవీ ప్రధానిగా సొంత రాష్ట్రానికి వస్తే వై.ఎస్ అభిమానులు చెప్పులు విసిరి చేసిన గందరగోళం మీకెందుకు గుర్తు లేదు? ఇక పీవీ మృతదేహానికి జరిగిన అవమానం ఎవరి హయాంలో జరిగిందో మీకెందుకు గుర్తు లేదు?

2 . బ్రాహ్మణ కార్పొరేషన్ కి 500 కోట్లు అన్నారు గానీ ఇప్పటిదాకా 136 కోట్లు మాత్రమే విడుదల చేశారని కోన విమర్శించారు. అసలు వై.ఎస్ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ అన్న ఆలోచనే లేదు కదా… అప్పుడెందుకు మీ నోరు పైకి లేవలేదు?

3 . ఐవైఆర్ కృష్ణారావు మీద టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణల్ని మీరు బ్రాహ్మణుల మీద దాడిగా ఆరోపించడం న్యాయమా ? కృష్ణారావు వెళ్ళిపోయినా ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఉన్న మాట నిజం కాదా… ఇప్పుడు చైర్మన్ గా వేమూరి ఆనంద్ సూర్య మాత్రం బ్రాహ్మణుడు కాదా ?

4 . ఒక కృష్ణారావుకి అన్యాయం జరిగితే బ్రాహ్మణులకి జరిగినట్టు చెప్తున్న మీకు… కార్పొరేషన్ ద్వారా వివిధ పధకాల రూపంలో వందలవేల మంది లబ్ది పొందిన విషయం ఎందుకు గుర్తు లేదు.

5 . పైగా ఓ కులసభలో ఓ పార్టీని మాత్రమే వ్యతిరేకించి మాట్లాడడం ఎంత వరకు సబబు?

6 . పైగా డిసెంబర్ లో సభకి కొందరు స్వామీజీలు కూడా వస్తారని చెబుతున్నారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని తిట్టేందుకు ఆ స్వాములు ఒప్పుకున్నారా?

దమ్ముంటే … నిజంగా బ్రాహ్మణ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే కోన రఘుపతి ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలగాలి.

మరిన్ని వార్తలు 

ఈ 8 సత్యాలు గుర్తిస్తే మీ బతుకుబండి సాఫీ.

ఏపీలో బ్రాహ్మణ రాజకీయం

ఆ భూముల కోసమే ఐవైఆర్ తిరుగుబాటు?