రానా షో ఫ్లాప్‌.. ఇక ఎన్టీఆర్‌ ఏం చేస్తాడో?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Rana Show Flap .. What Will NTR Do?

టాలీవుడ్‌ హీరోలు బుల్లి తెరపై తమ అదృష్టం వరుసగా పరీక్షించుకుంటున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో నాగార్జున మరియు చిరంజీవిలు బుల్లి తెరపై కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైనర్‌ చేసిన విషయం తెల్సిందే. ఇక యువ హీరోలు రానా మరియు ఎన్టీఆర్‌లు కూడా బుల్లి తెరపై తన అదృష్టంను పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యారు. రానా ‘నెం.1 యారి విత్‌ రానా’ అనే కార్యక్రమంతో మరియు ఎన్టీఆర్‌ ‘బిగ్‌ బాస్‌’ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

రానా ‘నెం.1 యారి విత్‌ రానా’ షో నిన్ననే ప్రారంభం అయ్యింది. రానా కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని భావించారు. కాని చాలా రెగ్యులర్‌గానే రానా టాక్‌ షో ఉంది. ఏమాత్రం ఎంటర్‌టైన్‌గా కొనసాగక పోవడంతో పాటు, ఆసక్తికర విషయాలను కూడా రాబట్టడంలో రానా విఫలం అయ్యాడు. ఈ షో అచ్చు జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ కార్యక్రమంను పోలి ఉందనే విమర్శలు వస్తున్నాయి. దీనికంటే ప్రదీప్‌ షోనే కాస్త ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిగి ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రదీప్‌ టాక్‌ షోలో సెలబ్రెటీలు ఎంటర్‌టైన్‌ చేస్తారు. కాని రానా మాత్రం సెలబ్రెటీలతో ఎంటర్‌టైన్‌ చేయలేక పోయాడు. మొదటి ఎపిసోడ్‌లో రాజమౌళి మరియు శోభు యార్లగడ్డలు షోలో పాల్గొన్నారు. వీరితో ఎంటర్‌టైన్‌ చేయాలని భావించినా సాధ్యం కాదు. ఇక ముందు ముందు షోలు అయినా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తాయేమో చూడాలి. వచ్చే నెలలో ఎన్టీఆర్‌ షో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఆ షోలో ఎన్టీఆర్‌ ఏం చేస్తాడో చూడాలి.

మరిన్నీ వార్తాలు:

వెరీగుడ్‌ బన్నీ.. గుడ్‌ ఛాయిస్‌

అందరు ఉన్నా అనాధలా.. కూలీతో అంత్యక్రియలు