వెరీగుడ్‌ బన్నీ.. గుడ్‌ ఛాయిస్‌

allu arjun naa peru surya naa illu india movie heroine

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్‌ తాజాగా ‘డీజే’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా విడుదలైందో లేదో వెంటనే తర్వాత ప్రాజెక్ట్‌పై శ్రద్ద పెట్టాడు. ఇటీవలే ప్రారంభం అయిన ‘నా పేరు సూర్య’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌కు సిద్దం అవుతున్నాడు. గత కొన్ని రోజులుగా ‘నా పేరు సూర్య’ హీరోయిన్‌ ఎవరు అనే విషయమై చర్చ జరుగుతుంది. ‘డీజే’ పనులు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్‌ వెంటనే హీరోయిన్‌ను ఫిక్స్‌ చేశాడు. పలువురు పేర్లను పరిశీలించిన తర్వాత దర్శకుడు వక్కంతం వంశీ నివేదా థామస్‌, అను ఎమాన్యూల్‌ మరో ఇద్దరు హీరోయిన్స్‌ను ఎంపిక చేశాడు. 

అల్లు అర్జున్‌ ఆ నలుగురు నుండి నివేదా థామస్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ‘జెంటిల్‌మన్‌’ చిత్రంతో పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయంతో కూడా ఈ అమ్మడికి ఆకట్టుకోగల సత్తా ఉంది. అందుకే ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రంలో వెంటనే బుక్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న నివేదా తాజాగా నానితో రెండవ సినిమాను కూడా పూర్తి చేసింది. ‘నిన్ను కోరి’ చిత్రాన్ని నానితో చేసిన నివేదాకు అల్లు అర్జున్‌ నుండి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో బన్నీతో కలిసి నివేదా థామస్‌ షూటింగ్‌లో పాల్గొనబోతుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ‘నాపేరు సూర్య’ చిత్రంలో హీరోయిన్‌గా స్థానం దక్కించుకున్న నివేదా థామస్‌ మంచి ఛాయిస్‌ అని, బన్నీ మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా సినీ ప్రముఖులు సైతం అంటున్నారు.

మరిన్నివార్తలు 

‘డీజే’ ఫ్యాన్‌ ఆత్మహత్య..!

జక్కన్న గురించి అతి చెత్త వార్త

 ‘డీజే’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌