‘డీజే’ ఫ్యాన్‌ ఆత్మహత్య..!

duvvada jagannadham fan committed suicide

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Duvvada Jagannadham Fan Committed Suicide For Negative Talk

అల్లు అర్జున్‌ నటించిన ‘డీజే’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డీజే’ చిత్రం యావరేజ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదే సమయంలో బ్రహ్మణ సంఘం వారు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీసులను మరియు కోర్టును ఆశ్రయించడం జరిగింది. హీరో అల్లు అర్జున్‌ ఈ సినిమాలో చెప్పులు వేసుకుని గాయత్రి మంత్రాన్ని చదివాడు అని, పవిత్రమైన గాయత్రి మంత్రంను అవమానించి మా మనోభావాలను దెబ్బ తీశారు అంటూ బ్రహ్మణ సంఘం వారు సినిమాను బ్యాన్‌ చేయాలని ఆందోళన నిర్వహిస్తున్నారు.

బ్రహ్మణులు చేస్తున్న ఆందోళనకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలోని ఒక థియేటర్‌ ముందు బన్నీ ఫ్యాన్స్‌ ఆందోళన చేశారు. వెంటనే బ్రహ్మన సంఘాల వారు ‘డీజే’ చిత్రంపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బన్నీ ఫ్యాన్స్‌ కోరారు. ఆ సమయంలోనే ఒక ఫ్యాన్‌ సినిమా నెగటివ్‌ టాక్‌ రావడంతో పాటు బ్రహ్మణులు చేస్తున్న ఆందోళనతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. ఒంటిమీద పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే పక్కనున్న వారు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆత్మహత్య యత్నం చేసిన ఆ అభిమానిని పోలీసులు అరెస్ట్‌ చేసి, కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేసినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు

‘డీజే’ ఫ్యాన్‌ ఆత్మహత్య..! - Telugu Bullet