అందరు ఉన్నా అనాధలా.. కూలీతో అంత్యక్రియలు

Paid funeral for Raviteja’s brother

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Paid funeral for Raviteja’s brother

రవితేజ సోదరుడి అంత్యక్రియలు జరిగిన తీరు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యింది. అందరు ఉన్నా కూడా అనాథ శవంలా భరత్‌ అంత్య క్రియలు జరగడం చాలా బాధకర విషయంగా ఇండిస్ట్రీలోని వారే అంటున్నారు. భరత్‌ చెడు దారిలో నడిచాడు, కుటుంబం పరువు తీశాడు. అయినా కూడా చనిపోయిన తర్వాత అంతా ఒక్కటే అన్న విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించకుండా భరత్‌ను అనాథలా వదిలేశారు. కనీసం అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా వదిలేశారు. కడుపు చీల్చి కన్నతల్లి కూడా కనీసం కనికరం చూపించకుండా వదిలేయయడం శోచనీయం.

భరత్‌ అంత్యక్రియలను రవితేజ మరో సోదరుడు రఘు దహన సంస్కారాలు దగ్గరుండి చేయించాడు. అయితే ఆయన కూడా అంటి ముట్టనట్లుగానే వ్యవహరించాడు. ఒక కూలీకి డబ్బులు ఇచ్చి అన్ని కార్యక్రమాలు చేయించాడు. చివరకు అదే కూలీతో చితికి నిప్పు అంటించాలని చెప్పాడు. సోదరుడి దహన సంస్కారాల్లో ఎందుకు రవితేజ పాల్గొనలేదు అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. రవితేజ చేసిన ఈ తప్పు ఎప్పటికి క్షమార్హం కాదని పెద్దలు అంటున్నారు. సోదరుడు ఎంతటి చెడు మార్గంలో వెళ్లినా కూడా రవితేజ ఇలా ప్రవర్తించి ఉండకూడదు అంటున్నారు. రవితేజ సన్నిహితులు మాత్రం తమ్ముడిని అలా చూసి తట్టుకోలేకనే అంత్యక్రియలకు వెళ్లలేదు అంటున్నారు. ఇది సరైన సమాధానంగా మాత్రం లేదు.

మరిన్నివార్తాలు: