VIP 2 లేటెస్ట్ ట్రైలర్ రివ్యూ.

vip 2 movie theatrical trailer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
VIP గా వచ్చి తమిళ్, తెలుగు ఇండస్ట్రీల్లో భారీ హిట్ కొట్టిన ధనుష్ ఆ సినిమా సీక్వెల్ తో రాబోతున్న విషయం తెలిసిందే. VIP 2 గా రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి విడుదల అయిన తాజా ట్రైలర్ రచ్చ లేపుతోంది. ఈ సినిమాకి కథ, డైలాగ్స్ హీరో ధనుష్ అందిస్తే ఆయన మరదలు, సూపర్ స్టార్ రజని రెండో కూతురు సౌందర్య ఈ సినిమాకి దర్శకత్వం చేశారు. చెన్నై లో నిన్న జరిగిన vip 2 ఆడియో వేడుకలో సరికొత్త ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల నిడివి వున్న ఈ ట్రైలర్ లో బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ విలన్ గా కనిపించడం విశేషం. ధనుష్ మార్క్ డైలాగ్స్ తో అదరగొట్టిన ఈ సినిమా ట్రైలర్ మీద మీరు కూడా ఓ లుక్ వేయండి.