భారత ప్రపంచకప్ ఫైనల్‌తో హాట్‌స్టార్‌లో ప్రపంచ రికార్డు

భారత ప్రపంచకప్ ఫైనల్‌తో హాట్‌స్టార్‌లో ప్రపంచ రికార్డు
Cinema News, Entertainment

గత కొన్ని రోజుల కితమే భారతీయులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. మరి ఈ మ్యాచ్ లో దురదృష్టవశాత్తు భారత్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ పట్ల అనేక అంచనాలు కూడా ఉన్నాయి. దీనితో ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ లో రికార్డులు బద్దలగొడుతుంది అని అనుకున్నారు. దీనితో మత్క్జ్ స్టార్ట్ అయ్యిన కొద్ది లోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా నే భారతీయులు మ్యాచ్ ని చూసారు.

భారత ప్రపంచకప్ ఫైనల్‌తో హాట్‌స్టార్‌లో ప్రపంచ రికార్డు
Hot Star Record

అయితే హాట్ స్టార్ వారు లేటెస్ట్ గా ఆరోజు నమోదు అయ్యిన వరల్డ్ రికార్డుని రివీల్ చేసేసారు . ఆ మ్యాచ్ లో తమ పీక్ స్టేజ్ లో హాట్ స్టార్ లో వ్యూస్ 59 మిలియన్ వ్యూవర్స్ చూసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ మ్యాచ్ ఒక సరికొత్త వరల్డ్ రికార్డు సెట్ చేసినట్టుగా హాట్ స్టార్ వారు అనౌన్స్ చేసేసారు . మరి ఈ రికార్డు అయితే మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్ అప్పుడే బ్రేక్ అవుతుంది అని చెప్పాలి. ఈ పీక్ టైం లో చాలా మూవీ ల వసూళ్లకు కూడా గట్టి ప్రభావమే కనిపించింది.