ఫ్లాష్..ఫ్లాష్..హీరో రవితేజ సోదరుడు భరత్ మృతి

హీరో రవితేజ సోదరుడు భరత్(52) రోడ్డు ప్రమాదంలో మరణించారు.శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ,  ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ మృతి చెందారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగిఉన్న లారీని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శంషాబాద్ లోని నోవాటెల్ లో పార్టీ కి అటెండ్ అయి తిరిగి సిటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది . భరత్ నడుపుతున్న కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

భరత్ తెలుగు చాల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,విలన్ గా చేసారు.ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు.భరత్ మృత దేహం ఇపుడు గాంధీ హాస్పిటల్ లో వుంది.రవితేజ అయన కుటుంబ సభ్యులు,తెలుగు సినిమా ప్రముఖులు హాస్పిటల్ కి చేరుకుంటున్నారు.