కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు

Congress Hopes For Next Elections

కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవడంతో.. కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని, బీజేపీకి ఎలా ఓటేస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో కేసీఆర్ మనసులో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారని మైండ్ గేమ్ షురూ చేశారు.

అసలు తెలంగాణలో ఫాదర్ ఆఫ్ మైండ్ గేమ్స్ కేసీఆర్. అలాంటిది హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా కాంగ్రెస్ నేతల చిందులేంటని గులాబీ నేతలు తేలిగ్గా తీసిపడేస్తున్నారు. కేసీఆర్ కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసని, కాంగ్రెస్ చెప్పినట్లుగా ఆయనకు దళిత వ్యతిరేకి అనే ముద్ర ఉంటే.. ఉపఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం వేసే ఓటుకు చాలా ప్రధాన్యత ఉంది కాంగ్రెస్ కు తెలుసు. గతంలో ఇందిర అభ్యర్థి వీవీ గిరిని వాళ్లు అలాగే గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా పాత పాచిక వేస్తే పారదని టీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే.. కాంగ్రెస్ నుంచే ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఢంకా బజాయిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కు స్ట్రాంగ్ రిటార్ట్ ఇచ్చినట్లైంది.