Sports: ముగిసిన రెండో రోజు ఆట.. పట్టుబిగించిన భారత్

Sports: The second day's play has ended.. India held on
Sports: The second day's play has ended.. India held on

ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 473 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 218 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఇప్పటికే 255 రన్స్ ఆధిక్యంలో భారత్ నిలిచింది. ప్రస్తుతం క్రీజులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 27, బుమ్రా 19 ఉన్నారు.

రెండో రోజు ఓవర్‌ నైట్‌ స్కోరు 135-1తో బ్యాటింగ్‌ ఆరంభించిన తర్వాత భారత్ కెప్టెన్ రోహిత్‌ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్‌ ( 110) సెంచరీలతో చెలరేగి ఆడారు. ఇక తొలి టెస్టు ఆడుతున్న దేవ్‌దత్‌ పడిక్కల్‌ ( 65), సర్ఫరాజ్‌ ఖాన్‌ (60 బంతుల్లో 56)లు అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇక నిన్న యశస్వి జైశ్వాల్ 57 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే.ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ నాలుగు వికెట్లు,హార్టీ 2 వికెట్లతో రాణించారు.