‘ఇండియన్‌ ఐడల్‌’ హోస్ట్‌గా శ్రీరామ చంద్ర

'ఇండియన్‌ ఐడల్‌' హోస్ట్‌గా శ్రీరామ చంద్ర

టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్‌లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు తమన్‌. 2009లో రవితేజ కిక్‌ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అనేక మంది స్టార్‌ హీరోలకు మ్యూజిక్‌ కంపోజ్‌ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో తమన్‌ పేరు మారుమోగిపోయింది. అందులో తమన్ కొట్టిన బీజీఎంకు మాములు క్రేజ్‌ రాలేదు. ఇదే కాకుండా పవన్‌ కల్యాణ్ ‘భీమ్లా నాయక్‌’ పాటలు ఇప్పటికే ఫుల్‌ పాపులర్‌ అయ్యాయి. దీంతోపాటు సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు తమన్‌. అయితే ప్రస్తుతం తమన్‌కు సంబంధించిన ఒక క్రేజ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతోంది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్స్‌తో వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. స్టార్‌ హీరోయిన్‌ సమంతతో ‘సామ్‌ జామ్‌’, నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే’ వంటి టాక్‌ షోలతో ఆహా అనిపించింది. తాజాగా తెలుగు ‘ఇండియన్‌ ఐడల్‌’ పేరుతో సింగింగ్‌ రియాలిటీ షోను పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్‌గా సింగర్‌, బిగ్‌బాస్ ఐదో సీజన్‌ కంటెస్టెంట్‌ శ్రీరామ చంద్ర హోస్ట్‌గా చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం ఈ షోకు న్యాయ నిర్ణేతగా తమన్‌ వ్యవహరించనున్నాడట.

ఇండియన్‌ ఐడల్‌ మేకర్స్‌ దాదాపుగా తమన్‌ను కన్ఫర్మ్‌ చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే షోకు రేటింగ్‌ ఎక్కువ వచ్చే ఛాన్సెస్‌ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే ఈ షోకు తమన్‌ జడ్జ్‌గా వస్తే సోషల్‌ మీడియాలో మీమర్స్‌కు కూడా పని దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే తమన్‌ చాలా సినిమాల నుంచి మ్యూజిక్‌ కాపీ కొడతాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యేవి. నాగార్జున నటించిన కింగ్‌ మూవీలోని కొన్ని సీన్లను స్పూఫ్‌ చేస్తూ తమన్‌పై ట్రోలింగ్‌, మీమ్స్‌ చేసినవారు కూడా ఎక్కువే. కాగా న్యాయనిర్ణేతగా తమన్‌ ఇచ్చే జడ్జిమెంట్‌పై ఆసక్తి నెలకొంది.