రామ్ చరణ్ భార్యని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

రామ్ చరణ్ భార్యని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్ళీ తననోటికి పనిచెప్పింది.ఇప్పుడు కొత్తగ మెగాఫ్యామిలీపై కామెంట్ చేసింది. ఇలా ఇండస్ట్రీలోని పెద్ద ఫ్యామిలీలను టార్గెట్ చేయడం అలవాటు అయిన శ్రీరెడ్డి ఉపాసన కొణిదెల, స్నేహారెడ్డిఅల్లుపై వ్యాఖ్యలు చేసింది.ప్రచారంకోసం ఎంతటివారిపైనైనా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతుంది.

ఈ మేరకు ఫేస్‌బుక్‌లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలని ఉన్నతమైన మహిళ అని పొగుడుతూ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి తనకి చాలా తేడాఉందని పోస్ట్ చేసింది.మిగతావారు ఉపాసన పాదంపై దుమ్ముతో సమానమని తాజాగా ఒక పోస్టు పెట్టి స్నేహారెడ్డిని తక్కువ చేస్తూ పోస్ట్ పెట్టింది.గతంలో శ్రీరెడ్డి  ఉపాసనపై సేవా కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్లను ఆదుకుంటున్నారని పొగుడుతూ వ్యాఖ్యలు చేసింది.