ఈ ముసలి నక్క ఎమ్మెల్యేనా : శ్రీరెడ్డి

sri reddy responds on prudhvi raj comments

శ్రీరెడ్డి నోరుకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి, ఎంతో మంది స్టార్స్‌ను రోడ్డున నిలబెట్టిన శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌ సెలబ్రెటీలపై వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. తమిళనాట ఈమెపై సెలబ్రెటీలు రివక్స్‌ ఎటాక్‌ చేయడంతో పాలుపోక మళ్లీ తెలుగు సినీ పరిశ్రమపై వ్యాఖ్యలు ప్రారంభించింది. తాజాగా కమెడియన్‌ 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. సాదారణ జనాలు కనీసం మాట్లాడుకోవడానికి, వినడానికి కూడా ఇష్టపడని బూతులు ఆమె సోషల్‌ మీడియాలో పృథ్వీ గురించి రాయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. కొన్నాళ్ల క్రితం పృథ్వీ మాట్లాడుతూ శ్రీరెడ్డి తీరును తప్పుబట్టాడు. ఇక వైకాపాలో జాయిన్‌ అయిన ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. పదే పదే వైకాపా గురించి మాట్లాడుతూ ఉన్న పృథ్వీపై శ్రీరెడ్డి కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

sri reddy responds on prudhvi raj comments

శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో పృథ్వీ గురించి స్పందిస్తూ.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లో నీ గోకుడు యవ్వారం తెలియని వారు ఎవ్వరు ఉండరు. నీ బాగోతం మొత్తం నాకు తెలుసు. నీ గురించి అమెరికాకు నీతో ఈవెంట్స్‌ కోసం వచ్చిన ప్రతి ఒక్కరు చెబుతూనే ఉంటారు. ఈ ముసలి నక్కకు అమ్మాయిలు కావాలట అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ముసలి వాడు ఇప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు అంటూ ఎద్దేవ చేసింది. ఇంకా పలు బూతులు రాసి పృథ్వీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై పృథ్వీ ఎలా రియాక్ట్‌ అవుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. ఆమె పోస్ట్‌కు చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు. ఎక్కువ శాతం జనాలు నీ భాష సరిగా ఉండేలా చూసుకో అంటూ సహా ఇస్తున్నారు. శ్రీరెడ్డి మాత్రం రోజు రోజుకు తన నోరును పారేసుకోవడం పెరుగుతూనే ఉంది