దుర్గ గుడి చీర మాయం….ఆమే తీసిందా ?

Saree Goes Missing In Goddess Kanaka Durga Temple

విజయవాడ దుర్గ గుడిలో ఆషాఢమాసం సందర్భంగా కొంతమంది భక్తులు అమ్మవారికి చీరలు సమర్పించగా వాటిలో రూ.18వేల విలువ చేసే చీర మాయమయ్యింది. ఈ వ్యవహారంంలో పాలకమండలి సభ్యురాలు సూర్యలతపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె మీద ఆలయ చైర్మన్ చర్యలు తీసుకున్నారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబు సూర్యలతకు మెమో జారీ చేశారు. ఈ చీర గొడవ తేలే వరకు ఆమెని గుడివైపు రావొద్దని ఆదేశించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించడంతో కేవలం 24 గంటల్లో విచారణ జరిపి నివేదికను సిద్ధం చేశారు. ఆలయ ఈవో పద్మ ఓ నివేదికను సిద్ధం చేసి ఆ నివేదికని ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమయ్యారట.

Saree Goes Missing In  Goddess Kanaka Durga Temple
అందులో ప్రత్యక్ష సాక్షల అభిప్రాయాలతో పాటూ సీసీ ఫుటేజ్‌ను కూడా పొందుపరిచారట. అందులో సూర్యకుమారి చీర తీసిందని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చీర పంచాయితీ మరింత ముదిరితే ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరో వాదన కూడా వినిపిస్తోంది. అయితే సూర్యలత ఈ మెమోను తీసుకునేందుకు నిరాకరించి పాలకమండల సమావేశం ఏర్పాటు చేయాలని కోరారట. ఛైర్మన్ మాత్రం ఈ వ్యవహారం తేలిన తర్వాత చూద్దామని చెప్పారట. దీంతో ఆమే చీర తీసినట్టు భావిస్తున్నారు.

Saree Goes Missing In  Goddess Kanaka Durga Temple