శ్రీదేవి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి?

Sridevi family Financial Status details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పైన పటారం, లోన లొటారం అన్నట్లుగా కపూర్‌ ఫ్యామిలీలు ఉన్నాయని ఆ మద్య ఒక హిందీ మీడియా సంస్థలో వార్త వచ్చిన విషయం తెల్సిందే. జయసుధ భర్త ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. బాలీవుడ్‌లో కపూర్‌ల ఫ్యామిలీకి మంచి పేరు ఉంది కాని, అందరు కూడా ఆర్థికంగా మాత్రం ఆశించిన స్థాయిలో, పేరున్న రేంజ్‌లో ధనికులు కారు అనేది అందరు ఒప్పుకునే విషయం. మరి శ్రీదేవి భర్త బోణీ కపూర్‌ ఆర్థిక పరిస్థితులు ఏంటీ అనేది ప్రస్తుతం ఆసక్తికర విషయంగా మారింది. గతంలో పలు సార్లు బోణీ కపూర్‌ ఆర్థిక పరిస్థితుల గురించి మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. 

బోణీ కపూర్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న కారణంగా శ్రీదేవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందని, ఆమె డబ్బుతోనే బోణీ కపూర్‌ ఆధారపడ్డాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలను కపూర్‌ ఫ్యామిలీ కొట్టి పారేసింది. శ్రీదేవి పలు చిత్రాల్లో నటించి సంపాదించిన డబ్బుతో పాటు, బోణీ కపూర్‌ పలు చిత్రాలను నిర్మించి విజయాన్ని సొంతం చేసుకుని నిర్మాతగా సక్సెస్‌ అయ్యాడు. అందుకే బోణీ కపూర్‌ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఏమీ లేదని, ఆయన శ్రీదేవి లైఫ్‌ ఇన్సురెన్స్‌ డబ్బుల కోసం ఆమెను చంపేందుకు దిగజారడు అంటూ కొందరు చెబుతున్నారు. మొత్తానికి శ్రీదేవి మరణం సహజమే అని తేలడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.