ఈసారి ఫుల్ ఎనర్జీ తో రానున్నాడట…!

Srikanth On About His Son Future Projects

చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంతో స్టార్ హీరోస్ నటించి శ్రీకాంత్, సోలో హీరోగా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తన మొదటి ప్రతి నాయకుడు పాత్రలో నటించి ఆ తరువాత స్టార్ హీరో గా ఎదిగినాడు. స్టార్ హీరోలతో పోటీ పడి మరి సినిమాలు చేశాడు. ముఖ్యంగా లేడీస్ లో శ్రీకాంత్ కి విపరీతమైన క్రేజీ ఉన్నది. ఇప్పటి వరకు దాదాపు గా 100 చిత్రాలకు పైగా నటించారు. ఇప్పటికి హీరోగా రాణిస్తూ, కుర్ర హీరోల సినిమాలో ప్రతినాయకుడి పాత్రలు చేస్తున్నాడు.

srikanth-movies

తాజాగా ఇచ్చినా ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ మాట్లాడుతూ…. నా కొడుకు రోహన్ ఒక సినిమాలో ప్రభుదేవా కొడుకుగా నటిస్తున్నాడు. ఇకా రోషన్ గురుంచి చెప్పాలి అంటే 2016 లో నిర్మల కాన్వెంట్ చిత్రం తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం తరువాత పై చదువుల కోసం లాస్ ఏంజెల్స్ పంపించాం. ఈ మధ్యే చదువు పూర్తి చేసుకొన్ని ఇండియా వచ్చాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా రోషన్ నటిస్తాడు. దానికి సంబందించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అన్నాడు. ఇప్పుడు రోషన్ లుక్స్ పరంగా కుర్ర హీరోలకు గట్టి పోటి ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎంతో మంది వారసులు వచ్చారు, అయితే వారిలో కొద్దిమంది మాత్రమే నిలదొక్కుకున్నారు. మరి ఈ కుర్రాడి పరిస్తితి ఏంటో చూడాలి.

srikanth-rohan