రెండవ మన్మధుడు మొదలెట్టబోతున్నాడు…!

Akkineni Nagarjuna Manmadhudu Movie Sequel

నాగార్జున హీరోగా 2002 లో మన్మధుడు అనే చిత్రం వచ్చింది. ఆ చిత్రం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఆ చిత్రానికి విజయ్ బాస్కర్ దర్శకత్వం వహించాడు. ఆ చిత్రలోని నాగార్జున లుక్, డ్రెస్సింగ్, నిజంగా మన్మధుడు అంటే ఇలానే ఉంటాడు అనే విధంగా ఆకట్టుకున్నాడు. అప్పటి నుండి నిజంగానే నాగార్జును మన్మధుడు అనే పేరు తో ఇప్పుడు కూడా పిలుస్తుంటారు. నాగార్జున ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలి అని ఎప్పటినుండో కల కంటున్నాడు. కొన్ని సందర్బాలలో మన్మధుడు 2 చిత్రంలో నేను నటించడం కన్నా నాగ చైతన్య నటిస్తే బాగుంటుంది అన్నాసందర్బాలు చాలానే ఉన్నాయి.

Manmadhudu-Movie

ఇప్పుడు మన్మధుడు చిత్రానికి సీక్వెల్ మన్మధుడు 2 లో నాగార్జున నే నటిస్తున్నాడు. దేవదాస్ చిత్రంలో నాగార్జున నటనకు, లుక్స్ పరంగా మంచి మార్క్స్ సంపాదించాడు. అందుకే మన్మధుడు 2 చిత్రానికి ఇదే కరెక్ట్ సమయం అని తలచాడు. రాహుల్ రవీంద్రన్ కూడా నాగార్జున కోసం ఓ మంచి కథను సిద్దం చేసి వినిపించాడు అంట. నాగ్ కూడా ఓకే చెప్పడంతో జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది. దీనికి ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వివరాలు త్వరలోనే తెలుస్తాయి అన్నారు.