జక్కన్న చేతుల మీదుగా శివాని లాంచ్‌

SS Rajamouli Launched Hero Rajashekar Daughter Shivani Movie 2 States

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శివాని మూవీ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. గత రెండు మూడు సంవత్సరాలుగా జీవిత రాజశేఖర్‌ల కూతురు శివాని హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు శివాని హీరోయిన్‌గా బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘2 స్టేట్స్‌’ రీమేక్‌ ప్రారంభం అయ్యింది. స్టార్‌ హీరో కూతురు సినిమా అవ్వడంతో భారీ ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమౌళి మరియు రాఘవేంద్ర రావు పాల్గొనడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు వెంకట్‌ కుంచం చెప్పుకొచ్చాడు. 

ముహూర్తం షాట్‌కు రాజమౌళి క్లాప్‌ కొట్టగా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. శివానికి మరియు చిత్ర యూనిట్‌ సభ్యులకు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు దంపతులు శుభాకాంక్షలు అందజేశారు. తెలుగులో కూడా అదే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర నిర్మాత పేర్కొన్నాడు. రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్స్‌ మాదిరిగానే ఈ చిత్రంలో శివాని కనిపించబోతుందని, గ్లామర్‌తో పాటు డాన్స్‌ మరియు నటనతో శివానీ మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందనే అభిప్రాయంను చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. టాలీవుడ్‌లో వారసులుగా హీరోయిన్స్‌ పెద్దగా వచ్చింది లేదు. నిహారిక, మంచు లక్ష్మిలు హీరోయిన్స్‌గా వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి శివాని అయినా మెప్పిస్తుందా అనేది చూడాలి.