తెలుగు సినీ ప్రేక్షకులందరికి అతి పెద్ద గుడ్‌ న్యూస్‌

Rajamouli RRR Movie Story Leaked

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి సంవత్సరం క్రితం ఒక ఫొటోను పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటోలో తనతో పాటు ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు కూడా ఉండటంతో అంతా కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుండు అని చాలా మంది అనుకున్నారు. కొన్ని రోజుల్లోనే ఆ ఫొటో వెనుక అసలు ఉద్దేశ్యం అదే అంటూ ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్‌, చరణ్‌లతో జక్కన్న మల్టీస్టారర్‌ అంటూ ప్రకటన వచ్చింది. సంవత్సర కాలంగా సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని తెలుగు సినీ ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. దాదాపు సంవత్సర కాలం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసిన జక్కన్న ఎట్టకేలకు సినిమాను పట్టాలెక్కించినట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది.

rrr-ntr-rajamouli-ramcharan

ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నేడు తెల్లవారు జామునే ప్రారంభం అయ్యింది. కోకాపేటలోని ప్రత్యేకమైన సెట్‌లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుతున్నారు. సెట్‌ నుండి జక్కన్న ఒక ఫొటోను విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్‌, చరణ్‌లతో కలిసి ఉన్న ఫొటోను రాజమౌళి విడుదల చేయడంతో పాటు సినిమా ప్రారంభం అయ్యిందని ప్రకటించాడు. మొదటి షెడ్యూల్‌ను వారం నుండి పది రోజుల పాటు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో లావుగా, బాడీ బ్డిర్‌గా కనిపించబోతున్నాడు. రామ్‌ చరణ్‌ మాత్రం విభిన్నమైన మేకోవర్‌తో, కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. హీరోలతో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసి, సెకండ్‌ షెడ్యూల్‌కు హీరోయిన్స్‌ను జక్కన్న రంగంలోకి దించుతాడేమో చూడాలి.

RRR