మహర్షి కోసం లెజెండ్‌ బ్యూటీ…!

Sonal Chauhan Playing A Key Role In Maharshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రతిష్టాత్మక ‘మహర్షి’ మూవీ గ్యాప్‌ లేకుండా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. కథానుసారంగా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ కూడా ఉంటుందట. ఆ హీరోయిన్‌ పాత్రను బాలయ్య ‘లెజెండ్‌’ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించిన సోనాల్‌ చౌహాన్‌ను నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈమె తెలుగులో ‘లెజెండ్‌’, ‘పండగ చేస్కో’ చిత్రాల్లో నటించినా కూడా పెద్దగా సక్సెస్‌ను దక్కించుకోలేక పోయింది. ఆ రెండు సినిమాల్లో కూడా సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర అవ్వడం వల్ల ఈమెకు గుర్తింపు రాలేదు. బాలీవుడ్‌లో అడపా దడపా సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ నెట్టుకు వస్తున్న సోసాల్‌కు ఈసారి మరో ఛాన్స్‌ దక్కింది.

maharshi-movie

మహేష్‌బాబు 25వ చిత్రం అవ్వడంతో మహర్షి చిత్రంపై దర్శకుడు వంశీ పైడిపల్లి చాలా శ్రద్ద పెట్టాడు. అల్లరి నరేష్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంను దిల్‌రాజు, అశ్వినీదత్‌, పీవీపీలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో త్వరలోనే సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల్లో బిజినెస్‌ మన్‌గా, రైతు నాయకుడిగా రకరకాలుగా మహేష్‌బాబు ఈ చిత్రంలో కనిపిస్తాడని సినీ వర్గాల వారు అంటున్నారు. మహేష్‌ కెరీర్‌లో ఈ చిత్రం నిలిచి పోతుందంటున్నారు. అలాంటి సినిమాలో ఛాన్స్‌ దక్కించుకున్న సోనాల్‌ చౌహాన్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని మిగిల్చుతుందో చూడాలి.

Mahesh Babu As Student In Maharshi Movie