మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

Gautham To Acting To Maharshi

మహేష్ ఫ్యాన్స్‌కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చే వార్త ఇది. అదేంటంటే మహేష్ బాబు కొడుకు గౌతమ్ మహర్షి సినిమాలో నటిస్తున్నాడట. గౌతమ్ ఇప్పటికే సుకుమార్ – మహేష్ బాబు కాంబోలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ చిత్రంలో మహేష్ బాబు పాత్రలో నటించారు. తాజాగా మరోసారి ప్రిన్స్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు గౌతమ్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ బాబు 25 మూవీ ‘మహర్షి’ చిత్రంలో గౌతమ్ ఓ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా మహర్షి షూటింగ్ లొకేషన్‌లో ఘట్టమనేని గౌతమ్ తన తల్లి నమ్రతా శిరోద్కర్‌లో కలిసి కనిపించడం పక్కనే దర్శకుడు వంశీ పైడిపల్లి షూట్ చేసిన రష్ కట్‌ని గౌతమ్, నమ్రతలకు చూపిస్తున్నట్టుగా ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. దీంతో మహేష్, గౌతమ్‌లు మహర్షి చిత్రంలో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని , ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. మే9న ప్రపంచ వ్యాప్తంగా మహర్షి చిత్రం విడుదల కానుంది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.