ఆంధ్రప్రదేశ్ 10 వ తరగతి పరీక్షల వాయిదా

ఆంధ్రప్రదేశ్ 10 వ తరగతి పరీక్షల వాయిదా

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తున్న కారణంగా మన ప్రభుత్వాలు ఎన్నో కీలకమైన చర్యలను చేపట్టాయి. కాగా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరోక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా రాష్ట్రంలో జరగాల్సిన 10 వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదెశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాగా ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ మేరకు అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు రాష్ట్రమంతా లాక్‌డౌన్ ఉన్న కారణంగా, విద్యార్థులకు ఎటువంటి రవాణా సౌకర్యాలు లేని కారణంగా ఈ పరీక్షలు వాయిదా వేశారని ‌సమాచారం.

ఇకపోతే తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ, సంబంధిత షెడ్యూల్, పరీక్షల తేదీలను ఖరారు చేయలేదని, త్వరలోనే అన్ని వివరాలను అదిఆకృకంగా ప్రకటిస్తామని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జికె.మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్యల డివిజన్‌ బెంచ్‌కు తెలిపారు. అయితే ఈ విషయంలో తదుపరి విచారణను ఏప్రిల్ 6 కి వాయిదా వేసినట్లు సమాచారం. కానీ ఈ విషయాల్లో ప్రబుత్వం కాస్త సీరియస్ గా ఉందని సమాచారం…