కింగ్ ఆఫ్ కామెడీ`కి స్టార్ హీరోల విషెస్!

ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ కింగ్ ఆఫ్ కామెడీగా, హాస్య బ్రహ్మగా గుర్తింపు సంపాదించుకున్నారు బ్రహ్మానందం. ఈ రోజు బ్రహ్మానందం గారి పుట్టినరోజు . నేటితో ఆయన 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ హీరోలు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ట్వీట్లు చేశారు.

 

మన కామెడీ కింగ్, పద్మ శ్రీ బ్రహ్మానందం గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే అంకుల్ -రామ్‌చరణ్

ఎంతో ఇష్టమైన బ్రహ్మానందంగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు -అల్లు అర్జున్

హ్యాపీ బర్త్ డే బ్రహ్మానందంగారు. షూటింగ్ సమయాలను ఎప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా ఉంచినందుకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో నవ్వతూ ఉండాలని ఆశిస్తున్నా -రవితేజ

కామెడీ కింగ్, హాస్య బ్రహ్మ బ్రహానందంగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా సర్ -సాయితేజ్