అసంతృప్తిలో దళపతి విజయ్

ఇళయ దళపతి విజయ్‌ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. తాను నటించిన కొత్త చిత్రం ‘మాస్టర్‌’ సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో విడుదలైంది. 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో పాటు పలు రకాలైన కోవిడ్‌ నిబంధనల మధ్య కరోనా లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో విడుదలైన తొలి చిత్రం ఇదే. పైగా కరోనా కష్టకాలంలోనూ ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. ఈ కారణంగా తొలి రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్ల మేరకు వసూలు చేసినట్టు ఫిల్మ్‌ ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో చిత్రం విడుదలైన కేవలం 16 రోజుల్లోనే అంటే జనవరి 29వ తేదీన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. ఈ మూవీకి మూడో వారంలో కూడా మంచి కలెక్షన్లు వస్తున్న సమయంలోనే చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడాన్ని థియేటర్‌ యాజమాన్య సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదే అంశంపై థియేటర్‌ యజమానులు ఇటీవల సమావేశమై ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు.

Kerala floods: Thalapathy Vijay makes a whopping contribution - News

ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించినందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని మొదటి వారం నుంచే చెల్లించాలని తీర్మానం చేశారు. ఇదే విషయంపై జరిగిన చర్చల్లో ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. అదేసమయంలో ముందుకుగా రిజర్వేషన్‌ చేసుకున్న ప్రేక్షకుల కోసం మరో రెండు మూడు రోజుల పాటు చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించి ఆ తర్వాత నిలిపివేయనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న విజయ్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. పైగా విజయ్‌ సినీ కెరీర్‌లోనే మంచి కలెక్షన్లు వస్తున్న ప్పటికీ ఒక చిత్రాన్ని మూడో వారంలోనే థియేటర్లలో ప్రదర్శించకుండా నిలిపివేయనుండటం ఇదే తొలిసారి. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ కూడా తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారట.