సల్మాన్ ఫామ్ హౌస్ లో ఓ రోజంతా గడిపిన స్టార్ హీరోయిన్

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ముంబై కు సమీపంలో విశాలమైన స్థలంలో ఓ ఫామ్ హౌస్ ఉంది. దానిపేరు పాన్ వెల్. తీరిక వేళలో సల్మాన్ అక్కడే గడుపుతుంటాడు. కరోనా కారణంగా సల్మాన్ ఖాన్ ఈ మధ్య తన ఫామ్ హౌస్ కూరగాయలు, పప్పులు, బియ్యం వంటివి వివిధ గ్రామాలకు ట్రాక్టర్ల మీద, ఎడ్ల బండి మీద పంపించారు. ఈ విషయంపై సల్మాన్ స్నేహితురాలు, నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా సహాయం చేసింది. ఫామ్ హౌస్ లో సల్మాన్ ఖాన్ తో పాటుగా సహాయ సహకారాలు అందించింది. అలా ఈ ఫేమస్ నటి ఫామ్ హౌస్ లో కొన్ని రోజుల పాటు అలా ఉండిపోయింది.

అయితే సల్మాన్ ఫామ్ హౌస్ లో ఓ రోజు అనే పేరుతో చిన్న వీడియో రూపొందించి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది జాక్వెలిన్. తాను ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం చేసింది అన్నది చిన్న వీడియో రూపంలో షూట్ చేశారు. బ్రేక్ ఫాస్ట్, ఫేమ్ హౌస్ లో ఉండే జంతువులతో ఆదుకోవడం, కొబ్బరి చెట్టు ఎక్కేందుకు ప్రయత్నం చేయడం, గుర్రానికి స్నానం చేయించడం, ఆ తర్వాత దానిపై ఎక్కి రైడ్ చేయడం వంటివ సాహసాలు చేసింది ఈ నారీమణి. మొత్తానికి ఈ ఇంస్టాగ్రామ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.