అల్లు అర్జున్‌తో సినిమా మొదలు పెట్టాలని సుకుమార్‌

అల్లు అర్జున్‌తో సినిమా మొదలు పెట్టాలని సుకుమార్‌

‘అల వైకుంఠపురములో’ విడుదలకి ముందే సుకుమార్‌ సినిమా షూటింగ్‌ మొదలు పెట్టాలని అల్లు అర్జున్‌ భావించాడు. ఆ సినిమా షూటింగ్‌ లేట్‌ అవడంతో అల్లు అర్జున్‌ ఇక ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్‌లో పడిపోయాడు. ఈ చిత్రం తాను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు భారీ విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్‌ రిలాక్స్‌ అయిపోయాడు. తదుపరి చిత్రంపై అంచనాలు భారీగా వుంటాయి కనుక సుకుమార్‌పై ఒత్తిడి పెట్టరాదని డిసైడ్‌ అయ్యాడు.

అందుకే కథకి తుది మెరుగులు దిద్దుకోవడానికి సుకుమార్‌కి తగినంత సమయం ఇచ్చాడు. అలాగే తాను కూడా గెటప్‌ ఛేంజ్‌ చేసుకోవడం కోసం విదేశాలకి వెళ్లబోతున్నాడు. తాపీగా మార్చి లేదా ఏప్రిల్‌లో షూటింగ్‌ మొదలు పెట్టి వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ ప్లాన్‌ చేసుకోవాలని అల్లు అర్జున్‌ భావిస్తున్నాడు. సుకుమార్‌ స్వతహాగానే కాస్త స్లో కనుక అల్లు అర్జున్‌ ఇప్పుడు తొందర పెట్టకపోవడంతో హ్యాపీగా తన పని తాను చేసుకుంటున్నాడు. ఆర్య లాంటి పాత్‌ బ్రేకింగ్‌ సినిమా ఇచ్చిన కాంబినేషన్‌ కనుక ఈ చిత్రంపై అంచనాలకి లోటు లేదు.