సందీప్ కొత్త అడుగులు.. ఇప్పుడైనా సక్సెస్ అయ్యేనా?

Sundeep kishan Turns Producer To Revive Career

సినిమాలో హీరో గా రాణిస్తూ నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం అనేది కొత్తేమి కాదు. అలా వచ్చినా వారిలో ఆనాటి ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలకృష్ణ, సుధీప్ బాబు, కళ్యాణ్ రామ్, ఇలా ఎందరో నిర్మాణా రంగం లోకి వచ్చినవారే, తాజాగా ఈ జాబితాలోకి మరో యువ నటుడు వచ్చి చేరాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నా హీరో సంధీప్ కిషన్ సొంతంగా ఓ బ్యానర్ ను స్టార్ట్ చేయనున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మంచి విజయంను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే పేరును తన సొంత బ్యానర్ కు వేంకటాద్రి టాకీస్ అని పెడుతున్నాడు.

sundeep kishan and anya singh

కొత్త కథలను చెయ్యాలనే ఉద్దేశ్యంతో సొంతంగా నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు తన బ్యానర్ లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సూపర్ నాచురల్ పవర్స్ ఉన్నా కథను తీసుకోని సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళ్ దర్శకుడు కార్తీక్ ఈ చిత్రాన్ని రూపొందిస్తారు. సందీప్ కిషన్ సరసన అన్య సింగ్ కథానాయకగా నటిస్తుంది. పోసాని, మురళి శర్మ. పూర్ణిమ బాగ్యరాజ్ తదితరులు నటిస్తున్నా ఈ చిత్రానికి తమన్ సంగీతం ను అందిస్తున్నాడు. సందీప్ కిషన్ ప్రస్తుతం నెక్స్ట్ ఏంటి అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే నెల ప్రేక్షకుల ముదుకు రానున్నది.