కేసీఆర్ ఓటమి బేల వెనుక వ్యూహం !

Times Now Pre Poll Survey On Telangana 2018

టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి రోజు రోజుకు గెలుపు దీమా తగ్గిపోతుందా ? డిసెంబర్ ఏడున ప్రజలు ఇవ్వబోయే తీర్పు కళ్ళముందు కనిపిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని రోజులుగా కేసీఆర్ తీరును ఆయన చేసిన యాగాలను గమనించిన వారికి గులాబీ బాస్ లో ఓటమి భయం కనిపిస్తోందని అర్ధం అవుతోంది. ఇక గురువారం టిఆర్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యలు చూస్తే ఓడిపోవడం ఖాయమని కేసీఆర్ ఫిక్స్ అయ్యారని అందుకే ఆ బాధను దిగమింగలేక వేదాంతం మాట్లాడుతున్నారని అర్థమైపోయింది. నేను ఓడిపోతే నాకు నష్టం ఏమి లేదు ఇంట్లో కూర్చుంటా అని ఆయన చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపాయి.

trs

అయితే ఇందులో ఓటమి పట్ల తనలోని బాధను వ్యక్తం చేయడంతో పాటు నన్ను ఓడిస్తే మీకే నష్టం జాగ్రత్త అని ప్రజలను హెచ్చరించడం దాగి ఉందని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన కేసీఆర్ వరుస సభలు నిర్వహిస్తున్నారు. అందులో యధావిధిగా టీపీపీ అధినేత చంద్రబాబును తిడుతూనే వున్నారు. అది పెద్దగా వర్కవుట్ కాలేదేమో కానీ ఇవాళ పూర్తి వైరాగ్యం ప్రదర్శించారు. ఖానాపూర్ ప్రచారసభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే గట్టిగా పని చేస్తానని.. లేదంటే ఇంట్లో పడుకుని రెస్ట్ తీసుకుంటానని, వ్యవసాయం చేసుకుంటానని అన్నారు. కానీ నష్టపోయేది ఎవరు? తెలంగాణ రాష్ట్రం, ప్రజలని అన్నారు. చంద్రబాబు చేతికి రాష్ట్ర అధికారం ఇస్తే ఇంకేమైనా ఉందా ఇప్పటికే తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దంటూ కేంద్రానికి 35 ఉత్తరాలు రాశారని. వీళ్లు అధికారంలోకి వస్తే మన ప్రాజెక్టులు సాగనిస్తారా? ఆయన మనసు ఇటు గుంజుతాదా? అంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

KCR Fair on Chandrababu
అయితే ఓడిపోతే తనకేం నష్టం లేదని కేసీఆర్ చేసిన ప్రకటన ఓ రకంగా తెలంగాణ రాష్ట్ర సమితికి మైనస్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కూటమికి అనుకూలంగా ఉందని.. అంతర్గతంగా జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ మాటలు మరింత ఊపునిచ్చినట్లవుతుంది. అయినా సరే కేసీఆర్ మాటలు అన్నారు. 70 స్థానాల్లో డిపాజిట్లు తెచ్చుకుంటే గొప్ప అనుకుంటున్న పార్టీ బీజేపీ కూడా గెలుస్తామని తొడకొడుతోంది కానీ ఎక్కడా ఓడిపోతే అన్న ఆలోచన కూడా దరి చేరనీయడం లేదు. కానీ.. కేసీఆర్ మాత్రం ఓడిపోతే నాకేం నష్టం అంటూ… అసువుగా మాట్లాడేస్తున్నారు. ఆయన మాత్రమే అనుకుంటనే ఆయన కుమారుడు కేటీఆర్ కూడా విద్యార్థులతో సమావేశం పెట్టి ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటేయమని తను ఓడిపోతే అమెరిక వెళ్లి ఉద్యోగం చేసుకుంటానని సందేశం ఇచ్చేశారు.ఓటమి మాటల ద్వారా కేసీఆర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని అనుకున్నప్పుడు కేసీఆర్ ఇలాంటి వ్యూహాలే అమలు చేస్తూంటారు.

KTR

గతంలో వైఎస్ దెబ్బకు టీఆర్ఎస్ పతనావస్థకు చేరినప్పుడు టీఆర్ఎస్‌లో తిరుగుబాటు వచ్చింది.అప్పుడు.. తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత మళ్ళీ పార్టీలో తిరిగి ఊపు వస్తుంది. ఆ వ్యూహంలోనే తాను ఓడిపోతున్నానని ఫీలింగ్ తెప్పించి సానుభూతి పెంచుకుని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే మరోపక్క ఓటమి పలుకులు వెనుక అసలు కారణం ఏమిటి అని ఆరా తీస్తే సంచలన సంగతులు బయటకు వచ్చాయి. కేసీఆర్ వ్యాఖ్యలకు కారణం తాజాగా చేసిన ఒక సర్వే అని తేలింది. ఇటీవల కేసీఆర్ స్వంతంగా ఒక సర్వే చేయించుకున్నారని టిఆర్ఎస్ లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ సర్వేలో షాకింగ్ రిజల్ట్ వచ్చిందట. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా పని చేస్తోందని కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి రోజు రోజుకు బలం పుంజుకుంటుందని తేలిందట. చంద్రబాబుమీద తాను చేసిన విమర్శలు రెచ్చగొట్టిన సెంటిమెంటు ప్రభావం చూపడం లేదని గతం కంటే అధికార పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని ఆ అధ్యయనం తేల్చిందట. ఆ సర్వే ఫలితాలు వచ్చిన తర్వాతే గులాబీ బాస్ లో వైరాగ్యం పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమయినా కేసేఆర్ నైరాశ్యం కూడా వ్యూహం లానే ఉంది.