పోలీస్ పాత్రపై నితిన్ మోజు?

వరుస పరాజయాలతో సతమతమవుతున్నా హీరో నితిన్ తన తరువాత సినిమాను వెంకి కుడుముల దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ చిత్రం కు బీష్మ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం టైటిల్ తోనే సినిమా పైన ఆశక్తి ని కలిగిస్తున్నాడు. ఈ చిత్రం లో ఛలో, గీత గోవిందం ఫేం రాష్మిక మంధన, నితిన్ సరసన నటిస్తున్నది. ఈ చిత్రం జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ గా షూటింగ్ జరగనున్నది. ఈ నేపద్యంలోనే నితిన్ తమిళ హిట్ట్ మూవీ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

పోలీస్ పాత్రపై నితిన్ మోజు? - Telugu Bullet

తమిళం లో ఘన విజయం సాదించిన రాచ్చాసన్ చిత్రం రైట్స్ ను నితిన్ దక్కించుకున్నాడట. ఈ చిత్రంను సైకో థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఆ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహించాడు. అమలపాల్, విష్ణు విశాల్ జంటగా నటించారు. విష్ణు విశాల్ రాచ్చాసన్ చిత్రంల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ చిత్రంలో ని పోలీస్ ఆఫీసర్ పాత్ర హీరో నితిన్ కి బాగా నచ్చినదంట. ఇంతవరకు నితిన్ పోలీస్ గెట్అప్ లో నటించలేదు. అందుకే ఈ చిత్రం పైన మనసు పారేసుకున్నాడు. ఈ చిత్రం లో ఆయనే నటిస్తాడా లేక సినిమా నిర్మాతా గా వ్యవహరిస్తాడా అనేది తెలియాల్సి ఉన్నది.