బయోపిక్‌ను పోర్న్‌లా తీయనున్నారా?

Sunny Leone Biopic title
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న సన్నీలియోన్‌ ఒకప్పుడు పోర్న్‌ స్టార్‌ అనే విషయం అందరికి తెల్సిందే. ప్రస్తుతం పోర్న్‌ సినిమాల జోలికి వెళ్లకుండా పూర్తిగా బాలీవుడ్‌ సినిమాలపైనే దృష్టి పెట్టింది. పలు చిత్రాల్లో ఈ అమ్మడు నటించి మెప్పించింది. ఇప్పుడు తన జీవిత చరిత్ర సినిమాకు సిద్దం అవుతుంది. జీ స్టూడియోస్‌ బ్యానర్‌లో సన్నీలియోన్‌ జీవిత చరిత్ర తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సన్నీలియోన్‌ జీవిత చరిత్ర స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. సన్నీలియోన్‌ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని చేయబోతున్నారు.

సన్నీలియోన్‌ అసలు పేరు కరంజిత్‌. పోర్న్‌ సినిమాలు మొదలు పెట్టిన తర్వాత ఈమె సన్నీలియోన్‌గా పేరును మార్చుకుంది. అందుకే సన్నీ జీవిత చరిత్ర సినిమాకు ‘కరంజిత్‌ టు సన్నీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సన్నీలియోన్‌ పాత్రను తానే స్వయంగా చేయనుందా లేదంటే మరో హీరోయిన్‌ ఎవరైనా ఈ పాత్రను చేస్తారా అనేది ఆసక్తికరంగా ఉంది. మరో వైపు ఈ చిత్రంలో సన్నీలియోన్‌ పోర్న్‌ సినిమాలను కూడా చూపిస్తారా అనేది చూడాలి. ఇండియన్‌ సినిమాల్లో పోర్న్‌ సినిమాలను చూపించేందుకు వీలు లేదు. ఆ కారణంగానే పోర్న్‌ సినిమాను చూపించరని, పోర్న్‌ చిత్రాల్లో నటించింది, ఎలా ఆమె పోర్న్‌ స్టార్‌ అయ్యింది అనే విషయాను చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి సన్నీలియోన్‌ బయోపిక్‌ సెన్షేషన్‌ అవ్వబోతుంది.