సన్నీలియోన్‌కి కన్నడ దెబ్బ గట్టిగా తగలనుందా…?

Sunny Leone Will Be Acting In Veera Mahadevi Movie

ఒకప్పటి పోర్న్‌ స్టార్‌ అయిన సన్నీ లియోన్‌ బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసి ఆ తర్వాత పలు భాషల్లోని సినిమాల్లో మెరిసిపోయింది. పలు తెలుగు చిత్రాల్లో కూడా ఈ అమ్మడు దర్శణమిచ్చింది. మొదట్లో కేవలం ప్రత్యేక పాటల్లో నటించిన ఈ అమ్మడు తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను సైతం ఎంపిక చేసుకుని నటిస్తోంది. ఈ అమ్మడు కన్నడ వీరనారి ‘వీరమహాదేవి’ చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో సన్నీ నటించకూడదు అంటూ కన్నడ వర్గాల నుండి ఆందోళనలు చెలరేగుతున్నాయి. గతంలో కొత్త సంవత్సరం వేడుకలకు గాను సన్నీకి భారీ పారితోషికం ఇచ్చి ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతుంటే కన్నడ ప్రజలు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వారి అభ్యంతరాలని నేను గౌరవిస్తాను అంటూ సన్నీ వెనక్కు తప్పుకుంది.

veera-mahadevi-sunny

ప్రస్తుతం ‘వీరమహాదేవి’ చిత్రంలో సన్నీని ఎలా తీసుకున్నారంటూ కన్నడ ప్రేక్షకులు ఆందోళను చేస్తున్నారు. ఉన్న ఫలంగా షూటింగ్‌ను నిలిపి వేయాలంటూ డిమాండ్‌లు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో సన్నీ రియాక్షన్‌ ఏంటి అనేది చూడాలి. గతంలో మాదిరి ఈ సారి కూడా సన్నీనే తప్పుకుంటదా లేదా ఈ చిత్రాన్నే ఆపేస్తారా లేక కన్నడ ప్రేక్షకులకు వ్యతిరేకంగా తెరకెక్కిస్తారా అనేది ఆసక్తికర అంశంగా మారింది. గతంలో సన్నీ కన్నడ ప్రజలకు ఆగ్రహం తెప్పించినందుకు ఇప్పటికి కూడా వారు సన్నీని తమ సినిమాల్లో అంగీకరించడం లేదు. గతంలో మాదిరి ఈసారి కూడా కన్నడ ప్రేక్షకుల నుండి సన్నీకి గట్టి దెబ్బ తగలుతుంది అని సినీ వర్గాల వారంటున్నారు.

sunny