సన్నీకి అస్వస్థత !

Sunny Leone Hospitalised

ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యింది. ఆమె గత కొంత కాలంగా ప్రముఖ టీవీ రియాల్టీ షో అయిన ‘ఎంటీవీ స్ప్లిట్స్ విల్లే’ సీజన్-11 షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఉదయం బాగానే ఉన్న సన్నీ కొన్ని గంటల క్రితం ఊహించని విధంగా కడుపు పట్టుకొని నిల్చున్న చోటే కింద పడిపోయిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తీవ్రంగా కడుపు నొప్పి తో ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

సన్నీ విషయాన్ని అర్ధం చేసుకొని షూటింగ్ ను నిలిపివేశారు. వెంటనే ఆమెను ఉత్తరాఖండ్ లోని కాషీపూర్ లో ఉన్న బ్రిజేష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు ప్రకటించారు. రేపు ఉదయం ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఫుడ్ పాయిజన్ అయ్యుంటుంది అని తెలుస్తోంది. సన్నీ ఆరోగ్యం ఇప్పుడు బానే ఉందని ఆమె మేనేజర్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం సన్నీ లియోన్ కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నారు.