సన్నీ రెండవ సిరీస్ ట్రైలర్…. మసాలా బాగా ఎక్కువే

Karenjit Kaur: The Untold Story of Sunny Leone - Season 2 Trailer

కరణ్‌జీత్ కౌర్ : ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ సిరీస్‌కు సంబంధించిన రెండవ సీజన్ ట్రైలర్‌ ను నిర్మాతలు విడుదల చేశారు. మొదటి సిరీస్‌లో సన్నీ లియోన్ చిన్నతనంలో జరిగిన సంఘటనలను చూపించిన సంగతి తెలిసిందే అంటే సన్నీ పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్లకముందు కరణ్‌జీత్ కౌర్ వోహ్రాగా ఉన్న సన్నీ పాత్రను మొదటి ఎపిసోడ్‌లో చూపించారు. అయితే ఈ రెండవ సిరీస్ కి వచ్చేప్పటికి పోర్న్ ఇండస్ట్రీ లోకి వెళ్ళాక తల్లి, తండ్రి, సోదరుడితో జరిగే గొడవలను చూపించనున్నారు.
Karenjit Kaur 2 Trailer

అలాగే సన్నీ జీవితంలోకి డానియల్ వెబర్ ఎలా ఎంటర్ అయ్యాడన్న కోణాన్ని కూడా రెండవ సిరీస్‌లో చూపిస్తారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే రెండవ సిరీస్‌లో కరణ్‌జీత్ కౌర్ వోహ్రా సన్నీగా మారుతుందన్నమాట.

Karenjit Kaur

ఆదిత్య దత్ డైరక్ట్ చేస్తున్న ఈ సిరీస్ లో సన్నీ సెలబ్రిటీగా ఎలా మారిందన్న కోణంలో మొత్తం అయిదు సిరీస్‌లను రిలీజ్ చేయనున్నారు. మొదటి సిరీస్ మంచి ఇంటరెస్ట్ కలిగించడంతో జాలు అందరూ ఈ రెండవ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు.