కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు మీద జేసీ సంచలన వ్యాఖ్యలు

jc comments on congress tdp alliance

గత కొద్దిరోజులుగా చర్చ నడుస్తోన్న కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తుల గురించి రకరకాల కామెంట్లు, విశ్లేషణలు వింటూనే ఉన్నాం. తాజాగా ఈ పొత్తుల ఊహాగానాల మీద మాజీ కాంగ్రెస్ నేత, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. కొద్దిసేపు భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని, అసలు ప్రభుత్వం ఏర్పాటి సంగతి అటుంచి ఎన్ని సీట్లు గెలుస్తామో చెప్పలేని స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు కోరుతోందని రాష్ట్రాన్ని దెబ్బ తీయడంలో అందరి పాత్ర ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే తప్పు లేదని జేసీ అభిప్రాయపడ్డారు.

chandra-babu

ఆంధ్రాలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదని అన్నారు. తెలంగాణలో పొత్తును ఏపీ ప్రజలు హర్షిస్తారని, కానీ ఏపీలో అవసరం లేదని జేసీ అన్నారు. బీజేపీని నమ్మి మోసపోయామని, అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అంటోందని, కాంగ్రెస్‌ని నమ్మి చూస్తే తప్పేమీ ఉండదని జేసీ వ్యాఖ్యానించారు. అలాగే విభజన పాపం కాంగ్రెస్, టీడీపీల రెండింటిది ఉందని, పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు అని దివాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని, అలా చేసినప్పుడు ముస్లింలు పార్టీకి దూరం అయి ఎక్కడ సీట్లు తగ్గుతాయో అన్న భయంతోనే ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్నాడని ఆయన కీసీఆర్ ను విమర్శించారు.