పాత పాట కొత్తగా పాడిన జైట్లీ.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విభజన వల్ల బాగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అంటే సానుభూతి ఉందని చెబుతున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సాయం విషయం వచ్చేసరికి మాత్రం ప్లేట్ ఫిరాయించారు. సెంటిమెంట్ ఆధారంగా ఆంధ్రాకి అదనపు సాయం చేయలేమని తేల్చేశారు. ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని చెప్పిన ఆయన రెవిన్యూ తక్కువగా ఉన్నందునే ఈశాన్య రాష్ట్రాలకు హోదా వల్ల కలిగే ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఏపీకి కూడా ఆ రకమైన ప్రయోజనాలు ఇస్తే అంతకన్నా తక్కువ రెవిన్యూ ఉన్న రాష్ట్రాలు కూడా అదే డిమాండ్ చేసే అవకాశం ఉందని జైట్లీ అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో బీజేపీ తో పొత్తుకు గుడ్ బై కొట్టే ప్రకటన చేస్తారని భావించి కౌంటర్ గా ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేసిన తప్పుల గురించి మాట్లాడాలని జైట్లీ తో మోడీ ప్రెస్ మీట్ పెట్టించారు. అయితే కేంద్రం తప్పుల గురించి అసెంబ్లీలో విపులంగా మాట్లాడిన చంద్రబాబు బీజేపీ తో తెగదెంపులు గురించి ప్రకటన మాత్రం చేయలేదు. కేంద్రం ఇంకో రెండు రోజుల్లో ఏదో ఒకటి చేయాలన్న డిమాండ్ మాత్రం ముందు పెట్టారు. అయితే ఆ డిమాండ్ ని పట్టించుకోకుండా మోడీ సర్కార్ ముందుకు వెళుతోంది అనడానికి తాజాగా జైట్లీ ప్రకటన ఇంకో ఉదాహరణ. దీంతో బీజేపీ , టీడీపీ బంధం తగినట్టే అని తేలిపోయింది. ఇక ఒకటి రెండు రోజుల్లో రాబోయే ప్రకటన మాత్రమే మిగిలివుంది.