మజిలీ రేపు సర్ప్రైజ్ ఇస్తుందా…?

Surprise Gift for Naga Chaitanya

నిజజీవిత జోడీ అక్కినేని నాగ చైతన్య మరియు సమంత లు తమ వివాహం తరువాత తొలిసారిగా కలిసినటించబోతున్న చిత్రం ‘మజిలీ’. నిన్నుకోరి అంటూ తన తొలిప్రయత్నంలోనే ఒక మంచి హిట్ సినిమాని నాని కి అందించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ మజిలీ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో లీకైన ఫోటోలను గమనిస్తే, ఈ సినిమా 80 వ దశకంలో జరిగే కథగా తెలుస్తుంది. కొన్ని నెలలుగా విశాఖపట్నం, పరిసర ప్రాంతాలైన సింహాచలం వద్ద షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం, నవంబర్ 26 నుండి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ని జరుపుకోబోతుంది.

Nagachaitanya And Samantha Tension For Majali Movie

హిందీ సీరియల్ నటి దివ్యంకా కౌశిక్ ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు మరియు పోసాని ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ (కృష్ణార్జున యుద్ధం ఫేమ్) ఈ సినిమాని నిర్మిస్తున్నారు.రేపు శుక్రవారం (నవంబర్ 23) రోజున నాగ చైతన్య పుట్టినరోజు ఉండడంతో, నందమూరి అభిమానుల సంతోషం కోసం చిత్ర యూనిట్ ఒక కొత్త సర్ప్రైజ్ ని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. బహుశా అది సినిమా ఫస్ట్ లుక్ అయ్యుండొచ్చు లేదంటే టీజర్ కూడా అయ్యుండొచ్చు. కానీ, ఏదో ఒక సర్ప్రైజ్ ఖాయం కాబట్టి ఆ సర్ప్రైజ్ ఏమిటా అని అక్కినేని అభిమానులే కాక సినీ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

majili