జగన్, పవన్ ల మద్దతు ఎవరికో…?

Pawan Kalyan Support On Telangana Elections

తెలంగాణ రాష్ట్రంలో రెండో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసహరణ గడువు ముగియడంతో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్న అనుమానానికి తర ముగిసింది. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని వీర ప్రసంగాలు చేసిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మందిని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తుందని అందరూ భావించిన క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పేశారు. ఎందుకంటే, తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని తాము అనుకోలేద‌నీ, అందుకే సంసిద్ధం కాలేక‌పోయామ‌ని నిన్న‌నే చెన్నైలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. సాధార‌ణ షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగి ఉంటే కొన్ని చోట్ల పోటీ చేయాల‌నే ఆలోచ‌న త‌మ‌కు ఉంద‌న్నారు. తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగిందని, శాసనసభ ఎన్నికల్లో కాకుండా షెడ్యూల్‌ ప్రకారం జరగబోయే లోకసభ ఎన్నికలలో పోటీ చేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Jagan and Pawan kalyan

లోకసభ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమయాత్తం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికలు ఇవి. తొలి ఎన్నికల్లో తెరాస విజయబావుటా ఎగురవేసింది. ఇపుడు మరో యేడాది అధికారం ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సై అంది. ఇపుడు కేసీఆర్‌తోపాటు ఆయన పార్టీని చిత్తుగా ఓడించాలన్న గట్టిపట్టుదలతో విపక్ష పార్టీలన్నీ ఉన్నాయి. ఇందుకోసం మహాకూటమిగా ఏర్పడి ముందుకుసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏ పార్టీకైనా మద్దతిస్తారా? లేక తటస్థంగా ఉండిపోతారా? ఒకవేళ మద్దతు ఇస్తే ఏ పార్టీకి ఇస్తారు? అనేది ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్‌తో పవన్ ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కేసీఆర్‌కు అండగా నిలిచి తెరాస అభ్యర్థులకు మద్దతునిస్తారని పెక్కుమంది భావిస్తున్నారు. ఇక‌, తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ అంశ‌మై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మొద‌ట్నుంచీ పెద్ద‌గా శ్ర‌ద్ధ పెట్ట‌లేదు.

pawan-kcr

2014 ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే తెలంగాణ‌పై వైకాపా ఆశ‌లు వ‌దిలేసుకుంద‌ని చెప్పొచ్చు. తెరాస అసెంబ్లీ ర‌ద్దు చేశాక పోటీ గురించిగానీ, ఇక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితుల గురించిగానీ ఇంత‌వ‌ర‌కూ జ‌గ‌న్ మాట్లాడిందే లేదు. తెలంగాణ‌లో దివంగత వైయస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అభిమానులు ఇప్ప‌టికీ చాలామంది ఉన్నారంటూ వైకాపా నేత‌లు కూడా అంటుంటారు. తాజా ఎన్నికల సంద‌ర్భంగా ఆ అభిమానుల‌కు జ‌గ‌న్ కూడా ఎలాంటి దిశానిర్దేశం చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. స‌రే, తెలంగాణలో రాజ‌కీయాల‌పై వైకాపా ఇప్ప‌ట్లో శ్ర‌ద్ధ పెట్టే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదన్న‌ది వాస్త‌వం. ఆంధ్రాలో ఒక‌సారి అధికారంలోకి రావాలి ఆ త‌రువాతే, తెలంగాణ గురించి జ‌గ‌న్ ఆలోచించే అవ‌కాశం ఉంది. కానీ, అభిమానులు అంటూ తెలంగాణ‌లో ఉన్నార‌ని చెప్పుకుంటున్నారు కాబ‌ట్టి ఈ ఎన్నిక‌ల్లో వారికి ఏదో ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవ‌స‌రం ఇప్పుడైతే ఈ రెండు పార్టీలకీ ఉంది.

Pawan Kalyan