WFIపై ప్రపంచ రెజ్లింగ్‌ సంఘం సస్పెన్షన్‌ వేటు..భారత్‌కు షాక్‌..

Suspension of World Wrestling Federation on WFI..Shock for India..
Suspension of World Wrestling Federation on WFI..Shock for India..

ప్రపంచ వేదికగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైనందుకు WFI షాకిచ్చింది . డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై భారత రెజ్లర్లు.. సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభంకానున్న ఒలింపిక్​ క్వాలిఫైయింగ్​ వరల్డ్ ఛాంపియన్​షిప్స్​ పోటీల్లో న్యూట్రల్​ అథ్లెట్లుగా బరిలోకి దిగాల్సి వస్తుంది. భారత్​ ట్యాగ్​లైన్​ లేకుండానే వారు ఆడాల్సి వస్తుంది.

‘‘డబ్ల్యూఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించనందుకు గానూ సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు UWW.. డబ్ల్యూఎఫ్‌ఐ అడహాక్‌ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం ఇచ్చింది’’ అని భారత ఒలిపింక్‌ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకున సంగతి తెలిసిందే. భారతీయ రెజ్లర్ల నిరసనలు, వివిధ రాష్ట్ర విభాగాల నుంచి న్యాయపరమైన పిటిషన్‌ల దాఖలు అయిన కారణంగా ఈ ఎలెక్షన్స్​ పదేపదే వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సభ్యత్వాన్ని సస్పండ్ చేస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయం తీసుకుంది.