ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన తాప్సి

Taapsi Apologized To Telugu Director K Raghavendra Rao

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుపై సంచలన వ్యాఖ్యలు చేసినపై విమర్శలు వెళ్లువెత్తాయి. హీరోయిన్స్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు అంటూ రాఘవేంద్ర రావుపై తాప్సి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం రేపాయి. హీరోయిన్‌గా పరిచయం చేసిన దర్శకుడిపై అలాంటి వ్యాఖ్యలు చేయడంను అంతా కూడా తప్పుపట్టారు. దానికి తోడు ఆమె తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ఆ వ్యాఖ్యల తర్వాత మరోసారి మీడియాతో మాట్లాడుతూ తాను ఆ వ్యాఖ్యలను ఏ ఉద్దేశ్యంతో చేశాను ఆయనకు తెలుసు మరియు నాకు తెలుసు. ఆయనంటే నాకు గౌరవం ఉంది, నేనేం తప్పుగా మాట్లాడలేదు అంటూ తాప్సి వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు మరింతగా ఆమెపై విమర్శలకు దారి తీశాయి.

తాప్సి తనపై వస్తున్న విమర్శలకు స్వస్థి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఎట్టకేలకు రాఘవేంద్ర రావుకు క్షమాపణలు చెప్పింది. ఆయన పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన అభిమానులు మరియు తెలుగు సినిమా ప్రముఖుల కూడా ఆవేదన చెందినట్లుగా గుర్తించాను. ఆయనను కించపర్చే ఉద్దేశ్యం తనకు లేదు అని, నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని, అలాగే రాఘవేంద్ర రావు గారికి కూడా క్షమాపణలు చెబుతున్నట్లుగా ఆమె ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. తాప్సి క్షమాపణలు చెప్పడంతో వివాదం సర్దుమనిగినట్లుగా పరిగణించవచ్చు. ఆమె హీరోయిన్‌గా నటించిన ఒక సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకే ఇలా క్షమాపణలు చెప్పి సినిమాకు లైన్‌ క్లీయర్‌ చేసినట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

 మరిన్ని వార్తలు:

ఈ రచ్చకు అంతటికి పూరినే కారణం!