ఈ రచ్చకు అంతటికి పూరినే కారణం!

Puri Jagannadh Is The Main Reason For Drug Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడుతున్న వారు ఇంత మంది ఉన్నారా అంటూ స్వయంగా టాలీవుడ్‌ ప్రముఖులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు 15 మందికి పోలీసులు డ్రగ్స్‌ వాడుతున్నట్లుగా అనుమానిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. వారిని ఈనెల 19న విచారించనున్నారు. డ్రగ్స్‌ కల్చర్‌ టాలీవుడ్‌కు ఎలా పాకి ఉంటుందని ఇప్పుడు సినీ ప్రముఖులు తల బద్దలు కొట్టుకుంటున్నారు. అయితే వారంతా కూడా ఇప్పుడు పూరి వైపే ఆగ్రహంగా చూస్తున్నారు. టాలీవుడ్‌ పరువు ఇప్పుడు గంగలో కలవడానికి కారణంగా పూరినే అంటూ అంతా విమర్శలు చేస్తున్నారు.

టాలీవుడ్‌లో మొదటగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డది పూరి జగన్నాధ్‌ అంటూ ప్రచారం జరుగుతుంది. పూరికి సన్నిహితులుగా మెలిగే రవితేజ, సుబ్బరాజు, ఛార్మి, ముమైత్‌ ఖాన్‌, నవదీప్‌ ఇంకా కొందరికి కూడా పూరి స్వయంగా డ్రగ్స్‌ను అలవాటు చేసి ఉంటాడు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్‌ టాలీవుడ్‌లో ఈ స్థాయిలో అలవాటు అవ్వడానికి కారణం పూరి అంటూ కొందరు డైరెక్ట్‌గానే అంటున్నారు. ప్రస్తుతం కొందరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కాని ఇంకా పదుల సంఖ్యలోనే డ్రగ్స్‌ తీసుకునే వారు ఉంటారు అని మీడియా వారు అంటున్నారు.

 మరిన్ని వార్తలు:

హైపర్‌ ఆది గురించి ఇంత చర్చ అవసరమా?

డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్న వారిని బ్యాన్‌ చేయాలి