డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్న వారిని బ్యాన్‌ చేయాలి

Drugs Case accuses will be ban for 5 years from Telugu Film Industry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు డ్రగ్స్‌ వాడుతున్నట్లుగా నిరూపితం అయ్యింది. ఇటీవల డ్రగ్స్‌ రాకెట్‌లో అరెస్ట్‌ అయిన కొందరి నుండి సినీ ప్రముఖులు డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లుగా వెళ్లడైంది. గత కొన్ని సంవత్సరాలుగా పూరి జగన్నాధ్‌, రవితేజ, ఛార్మి, ముమైత్‌ ఖాన్‌, నందు, నవదీప్‌ వంటి వారు డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దాంతో వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈనెల 19 నోటీసులు అందుకున్న వారు అంతా కూడా విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు స్టిక్ట్‌గా ఆదేశాలు ఇచ్చారు. వీరు హైదరాబాద్‌ వదిలి కూడా వెళ్ల కూడదు అనేది పోలీసుల ఆదేశం.

ఒక వైపు వారిని రహస్య ప్రదేశంలో రోజంగా విచారించేందుకు పోలీసులు సిద్దం అవుతుండగా, సినీ పరిశ్రమకు చెందిన కొందరు మాత్రం నోటీసులు అందుకున్న వారందరిని బ్యాన్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ వస్తుంది. ప్రేక్షకులు కూడా డ్రగ్స్‌ వాడినట్లుగా నిరూపితం అయిన వారిని టాలీవుడ్‌ నుండి బహిష్కరించాల్సిందే అంటున్నారు. మా మరియు ఇతర సినీ ప్రముఖులు మాత్రం వేచి చూద్దాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారు డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా నిరూపితం అయితే పోలీసులు కేసు బుక్‌ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని ఆలోచిద్దాం అన్నట్లుగా ఉన్నారు. కనీసం అయిదు సంవత్సరాలు అయినా వారిని బ్యాన్‌ చేయాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతుంది. అలా చేస్తే ఇండస్ట్రీకి చెందిన వారు మరోసారి అలాంటి తప్పు చేయరు అనేది అందరి వాదన.

 మరిన్ని వార్తలు:

పటేల్ సర్…తెలుగు బులెట్ రివ్యూ.

డ్రగ్స్‌ తీసుకునే వారికి జీవిత మద్దతు.. విమర్శలు