సక్సెస్‌ కోసం చరణ్‌ ఎంత పని చేశాడో తెలుసా?

ram charan offered 15 crores remunaration to koratala shiva for next movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ యువ హీరోలు వరుసగా సక్సెస్‌లతో దూసుకు పోతుంటే రామ్‌ చరణ్‌ పరిస్థితి మాత్రం ఒక సక్సెస్‌ రెండు ఫ్లాప్‌లు అన్నట్లుగా ఉంది. ధృవ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా కూడా తప్పకుండా ఘన విజయం సాధించడం ఖాయం అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సినిమా గురించి వస్తున్న వార్తలను చూస్తుంటే సినిమా ఖచ్చితంగా సక్సెస్‌ అయ్యేలాగే ఉంది. రెండు వరుస సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్న చరణ్‌ మూడవ సినిమాతో కూడా సక్సెస్‌ను దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాడు. అందుకోసం మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. 

చాలా సంవత్సరాల క్రితం చరణ్‌ హీరోగా బండ్లగణేష్‌ నిర్మాణంలో కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం అయ్యింది. అయితే ఆ సినిమా కథలో మార్పులు చేర్పులు సూచించడంతో కొరటాల ఆ సమయంలో సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు, వరుసగా సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌లను అందుకున్నాడు. దాంతో కొరటాల శివతో సినిమా చేస్తే సక్సెస్‌ గ్యారెంటీ అని భావించిన చరణ్‌ మళ్లీ ఆయనను ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. చివరకు కొరటాలను 15 కోట్ల పారితోషికంతో ఒప్పించినట్లుగా తెలుస్తోంది. స్వయంగా చరణ్‌ ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. కొరటాలకు భారీ పారితోషికం ఇచ్చేందుకు చరణ్‌ స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. అధికారికంగా 15 కోట్లు అటున్నారు. అయితే 20 కోట్ల వరకు చరణ్‌ దర్శకుడికి ముట్ట జెప్పే అవకాశం ఉందని మెగా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

మరిన్ని వార్తలు

పటేల్ సర్…తెలుగు బులెట్ రివ్యూ.

డ్రగ్స్‌ తీసుకునే వారికి జీవిత మద్దతు.. విమర్శలు